చెస్‌ ఒలింపియాడ్‌లో భారత జట్టు

చెస్‌ ఒలింపియాడ్‌లో భారత జట్టు

ప్రతిష్టాత్మక చెస్‌ ఒలింపియాడ్‌లో సత్తా చాటేందుకు స్టార్లతో కూడిన భారత జట్టు సన్నద్ధమైంది. కరోనా నేపథ్యంలో ఆన్‌లైన్‌లో నేటి నుంచి జరుగనున్న ఈ ఈవెంట్‌లో టీమిండియా టైటిల్‌పై దృష్టి సారించింది. భారత్‌తో పాటు చైనా, రష్యా, అమెరికా జట్లు ఫేవరెట్‌లుగా ఈ టోర్నీ బరిలో నిలిచాయి. మాజీ ప్రపంచ చాంపియన్‌ విశ్వనాథన్‌ ఆనంద్, ఆంధ్రప్రదేశ్‌ గ్రాండ్‌మాస్టర్‌ పెంటేల హరికృష్ణ, విదిత్‌ ఎస్‌ గుజరాతీ (కెప్టెన్‌), కోనేరు హంపి, ద్రోణవల్లి హారిక, యువ ఆటగాళ్లు ఆర్‌. ప్రజ్ఞానంద, నిహాల్‌ సరీన్‌ తదితరులు భారత్‌కు ప్రాతినిధ్యం వహించనున్నారు. ఏడో సీడ్‌గా బరిలోకి దిగనున్న భారత్‌ టాప్‌ డివిజన్‌ పూల్‌ ‘ఎ’లో చైనా, జార్జియా, వియత్నాం, జర్మనీ, ఇరాన్, ఇండోనేసియా, ఉజ్బెకిస్తాన్, మంగోలియా, జింబాబ్వే జట్లతో కలిసి ఆడనుంది.

లీగ్‌ దశ అనంతరం ప్రతీ పూల్‌లోనూ టాప్‌–3లో నిలిచిన జట్లు నాకౌట్‌ పోటీలకు అర్హత సాధిస్తాయి. పోటీల్లో భాగంగా తొలి మ్యాచ్‌లో శుక్రవారం మధ్యాహ్నం గం. 1:30కు జింబాబ్వేతో, రెండో మ్యాచ్‌లో వియత్నాం (గం. 2:30), మూడో మ్యాచ్‌లో ఉజ్బెకిస్తాన్‌ (గం. 3:30)తో భారత్‌ తలపడుతుంది. మే నెలలో జరిగిన ఆన్‌లైన్‌ నేషన్స్‌ కప్‌లో రాణించలేకపోయిన భారత్‌ ఒలింపియాడ్‌లో సత్తా చాటుతుందని కెప్టెన్‌ విదిత్‌ గుజరాతీ ఆశాభావం వ్యక్తంచేశాడు.

ఆరు జట్లు పాల్గొన్న నేషన్స్‌ కప్‌లో భార™Œత్‌ ఐదో స్థానంతో ముగించింది. హరికృష్ణ కూడా ఇదే అభిప్రాయాన్ని వెలిబుచ్చాడు. టోర్నీలో భారత్‌ గట్టి పోటీనిస్తుందని అన్నాడు. భారత జట్టు : పురుషులు: ఆనంద్, విదిత్‌ (కెప్టెన్‌). మహిళలు: హంపి,్ల హారిక. జూనియర్‌ బాలురు: నిహాల్‌ సరీన్‌. జూనియర్‌ బాలికలు: దివ్య దేశ్‌ముఖ్‌. రిజర్వ్‌ ప్లేయర్లు: పి. హరికృష్ణ, అరవింద్‌ చిదంబరం, భక్తి కులకర్ణి, ఆర్‌. వైశాలి. ఆర్‌. ప్రజ్ఞానంద, వంతిక అగర్వాల్‌.