పసికందును గోడకేసి కొట్టిన కన్నతల్లి

పసికందును గోడకేసి కొట్టిన కన్నతల్లి

ఏడుస్తోందనే కారణంతో నెల రోజులైనా నిండని పసికందును ఓ కన్నతల్లి కర్కశంగా ప్రవర్తించి గోడకేసి కొట్టిన దారుణమైన ఘటన కేరళలో వెలుగుచూసింది. నెలలు నిండకుండా జన్మించిన శిశువు తరుచూ అనారోగ్యానికి గురికావడం, గుక్కపట్టి ఏడుస్తుండటంతో సహించలేకపోయిన ఈమె ఏ తల్లీ చేయని విధంగా ప్రవర్తించింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. డిసెంబరు 9న 27 రోజుల శిశువును గోడకేసి బలంగా కొట్టడంతో తీవ్ర అస్వస్థతకు గురయ్యింది.

దీంతో అదే రోజున ఉదయం 11 గంటలకు పత్తనంతిట్టాలోని ఆస్పత్రికి చికిత్స కోసం తరలించగా.. అక్కడి డాక్టర్లు శిశువును పరీక్షించి మందులు రాసి ఇంటికి పంపారు. ఇంటికొచ్చిన తర్వాత చిన్నారి పరిస్థితి క్రమంగా దిగజారడంతో అదే రోజున తాలుకా ఆస్పత్రికి తరలించారు. అక్కడే చికిత్స పొందుతూ శిశువు చనిపోయింది.

ఈ ఘటనపై స్థానికంగా ఆశ్రమం నడుపుతున్న ఫాదర్ జోజి థామస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితురాలు అదే ఆశ్రమంలో వంట మనిషిగా పనిచేస్తోంది. తన ప్రియుడితో కలిసి సహజీవనం చేస్తోందని పోలీసులు తెలిపారు. డిసెంబరు 10న శిశువుకు పోస్ట్‌మార్టం నిర్వహించగా.. తల వెనుక బలమైన గాయాలున్నట్టు గుర్తించారు. శిశువు పుర్రె దృఢంగా లేకపోవడంతో గాయం బయటకు కనిపించలేదని పోలీసులు చెప్పారు.

మహిళ కొంత మానసిక అసౌకర్యాన్ని చూపడంతో, ఆమెను వివరంగా ప్రశ్నించలేదు మరియు జంట గురించి ఆరా తీస్తే, వారు ఫోన్‌లో ఒకరినొకరు కలుసుకున్నారని మరియు ఆశ్రమంలో కలిసి జీవించడం ప్రారంభించారని పోలీసులు గుర్తించారు.

నిందిత మహిళ మానసిక పరిస్థితి సక్రమంగా లేకపోవడంతో ఆమెను పోలీసులు వివరంగా ప్రశ్నించలేదు. ఆ జంట గురించి ఆరా తీయగా.. ఫోన్‌లో ఒకరినొకరు కలుసుకున్నారని, ఆశ్రమంలోనే కలిసి ఉంటున్నారని పోలీసులు గుర్తించారు. ప్రియుడికి ఇది వరకే వివాహమయ్యిందని, ఈ విషయం ఆమెకు కూడా తెలుసని చెప్పారు. లోతుగా విచారించడంతో కన్నతల్లే బిడ్డను చంపినట్టు నిర్ధారణ కావడంతో ఆమెను పోలీసులు అరెస్ట్ చేశారు.

ఓ ప్రయివేట్ కాలేజీలో చదువుతున్న యువతికి వివాహితుడు ఫోన్‌ ద్వారా పరిచమయ్యాడు. ఇద్దరూ సహజీవనంలో ఉండగా ఓ బిడ్డ జన్మించిందని, అనారోగ్యంతో ఉన్న ఆ శిశువు తనకు గుదిబండగా మారుతుందని భావించి ఈ ఘాతుకానికి ఒడిగట్టిందని పోలీసులు వెల్లడించారు.