దేశీ టెక్ దిగ్గజం ఇన్ఫోసిస్ మాజీ ఉద్యోగులపై వచ్చిన ఆరోపణలను తోసిపుచ్చింది. కంపెనీలో సహ వ్యవస్ధాకులు వచ్చిన విజిల్ బ్లోయర్ ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నామని ఓ ప్రకటనలో ఇన్ఫోసిస్ పేర్కొన్నది.
విజిల్ బ్లోయర్ లేఖలో కంపెనీ ఉద్యోగులు రాసిన ఆరోపణలకు తాము ఎలాంటి ఆధారాలు అందుకోలేదని తెలియచేసింది. చీఫ్ ఎగ్జిక్యూటివ్ సలీల్ పరేఖ్ తమతో పాటు మరికొందరిని భారీ ఒప్పందాలకు అనుమతులు ఇవ్వరాదని ఒత్తిడి చేశారని విజిల్ బ్లోయర్ లేఖలో ఉద్యోగులు పేర్కొన్నారు. లాభాలు తగ్గితే షేర్లపై ప్రతికూల ప్రభావం చూపుతుందనే భయంతో భారీ ఒప్పందాలకు అనుమతులు ఇవ్వరాదని తెలిపరని సమాచారం.