ఇంకొన్ని రోజుల్లో కొత్త సంవత్సరం రానుంది. ఈ సమయంలో సింహావలోకనం చేసుకున్నట్లుగా పెళ్లి, పుట్టినరోజు, శుభకార్యం.. ఇలా ‘స్పెషల్ మూమెంట్స్’ను గుర్తు చేసుకోవడం మనకు అలవాటు. ఇప్పుడు మనసులోనే వాటిని గుర్తు చేసుకోనక్కర్లేదు. ఫొటోలు, వీడియోల రూపంలో చూసుకొని మరోసారి సంతోషించవచ్చు. ఇన్‌స్టాగ్రామ్ ‘ప్లేబ్యాక్’ అనే ఫీచర్‌ను తీసుకువచ్చింది.
ఈ ఫీచర్ సహాయంతో ఆర్కైవ్‌లో నుంచి మనకు నచ్చిన 10 సందర్భాలను సెలెక్ట్ చేసుకోవచ్చు. షేర్ చేయవచ్చు. గత ఏడాది కాలంలో వినియోగదారులు తమకు నచ్చిన స్టోరీలను తిరగి తమ స్టోరీ మీద జత చేసుకునే ఒక కొత్త ఫీచర్. వీటిని మీకు నచ్చిన మిత్రులతో కూడా షేర్ చేయవచ్చు. ఇది ఒక లిమిటెడ్ ఫీచర్. ఈ ఏడాది ముగింపు వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. మీరు కూడా మీకు నచ్చిన పాత స్టోరీలను ప్లేబ్యాక్ ఫీచర్ సహాయంతో క్రియేట్ చేసుకోండి.