మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి కోసం పోలీసులు గాలిస్తున్నారు. క్వార్జ్ కేసులో రెండు నెలలుగా కాకాణి తప్పించుకుని తిరుగుతున్నారు. దీంతో హైదరాబాద్, బెంగళూర్‌లో నెల్లూరు పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. కాకాణి బంధువుల ఇళ్లు, ఫాంహౌజ్‌లలో గాలిస్తున్నారు. మరోవైపు క్వార్జ్ కేసులో మరో 12 మందికి పోలీసులు నోటీసులు ఇచ్చారు. క్వార్జ్ కేసులో మాజీ మంత్రి కాకాణి ఏ4గా ఉన్నారు. ఈ కేసుకు సంబంధించి గతంలో హైకోర్టును ఆశ్రయించి బెయిల్ పొందే ప్రయత్నాలు చేశారు కాకాని. అయితే ఆ ప్రయత్నాలు ఏవీ ఫలించలేదు.