ఇంటర్ తప్పడంతో బాలిక ఆత్మహత్య….

Couple Commit Suicide After Daughter Elopes With Lover

కృష్ణాజిల్లాలో ఘోరం జరిగింది. తాజాగా ప్రభుత్వం ఇంటర్ ఫలితాలను వెల్లడించిన విషయం తెలిసిందే. అయితే ఇంటర్ మొదటి సంవత్సరం ఫెయిన్ అయిన కారణంగా తీవ్ర మనస్తాపంతో ఓ బాలిక ఆత్మహత్య చేసుకుంది. ఐదు గంటలకు ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలను రద్దు చేస్తున్నట్టు ప్రకటించిన ప్రభుత్వం అందరూ పాస్ అయినట్టు పేర్కొంది. అంటే బాధిత బాలిక ఒక్క గంటపాటు క్షణికావేశానికి గురికాకుండా ఉంటే ప్రాణాలు మిగిలి ఉండేవి.

 కాగా కృష్ణా జిల్లా గుడివాడలో జరిగింది ఈ ఘటన. దీంతో స్థానిక ధనియాలపేటకు చెందిన బాలిక  ఇంటర్ ఫస్టియర్ ఫలితాల్లో ఫెయిల్ అయింది. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన బాలిక శనివారం నాలుగు గంటల సమయంలో ఎలుకల మందు తిని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. వెంటనే గమనించిన తల్లిదండ్రులు ఆ బాలికను పీహెచ్‌సీకి, అక్కిడి నుంచి బందరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ బాలిక కన్నుమూసింది. కాగా బాలిక ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన గంట తర్వాత ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలను రద్దు చేస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. దీంతో అందరినీ పాస్ చేస్తున్నట్టు తెలిపింది. కాగా బాలిక ఒక గంటపాటు ఓపిక పట్టి ఉంటే ఆమె ప్రాణాలు దక్కి ఉండేవని తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.