కరోనాకు వ్యాక్సిన్ వచ్చేసిందోచ్..

కరోనా ప్రస్తుతం ప్రపంచ దేశాలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. నాలుగు నెలల పాటు ప్రపంచ దేశాలు లాక్ డౌన్ విధించుకొని ఇంటికే పరిమితమైనప్పటికీ.. కరోనా తీవ్రత ఏమాత్రం తగ్గ లేదు సరికదా ఇంకా దాని తీవ్రత చూపుతూనే ఉంది. అయితే పంచదేశాలన్నీ కరోనా వైరస్ ను కట్టడి చేసేందుకే ఉపకరించే వ్యాక్సిన్ కోసం ఎంతో కాలంగా ఎదురుచూస్తున్నాయి. ఇదే సమయంలో కొన్ని ఔషధాలు కరోనా చికిత్సలో సమర్థవంతంగా పనిచేస్తూ ఊరటను కలిగిస్తున్నాయి. తాజాగా ప్రముఖ ఫార్మా సంస్థ గ్లెన్ ఫార్మా భారత మార్కెట్లో సరికొత్త కరోనా ఔషధాన్ని రిలీజ్ చేసింది. ఇది నోటి ద్వారా తీసుకునే యాంటీ వైరల్ డ్రగ్. ‘ఫావిపిరావిర్’ అనే ఈ మందును ‘ఫాబిఫ్లూ’ పేరుతో విక్రయించనున్నారు. ‘ఫాబిఫ్లూ’ మాత్రలను కరోనా చికిత్సలో ఉపయోగించేందుకు కేంద్రం అనుమతులు తెలిపింది. అయితే ఈ ఔషధం పనితీరును అంచనా వేసిన భారత ఔషధ నియంత్రణ సంస్థ బాధ్యతాయుతమైన ఔషద వినియోగానికి ఆమోద ముద్ర వేసిందని తెలిపింది.

అయితే దేశంలో పెద్ద సంఖ్యలో కరోనా మరణాలు సంభవిస్తున్న ఈ తరుణంలో ఇది ఓరకంగా శుభవార్త అనే చెప్పాలి. దీనిపై ‘ఫాబిఫ్లూ’ తయారీదారు గ్లెన్ ఫార్మా స్పందిస్తూ.. క్లినికల్ ట్రయల్స్ లో ‘ఫాబిఫ్లూ’ ప్రోత్సాహకర ఫలితాలను ఇచ్చిందని తెలిపారు. కరోనా రోగులు తొలిరోజు ఫాబిఫ్లూ 1800 ఎంజీ టాబ్లెట్లు రెండుసార్లు వేసుకోవాలని, ఆ తర్వాత 14 రోజుల పాటు 800 ఎంజీ టాబ్లెట్లు రోజుకు రెండుసార్లు వేసుకోవాలని తెలిపింది. కరోనా చికిత్స కోసం విడుదల చేసిన ఫాబిఫ్లూ టాబ్లెట్ ధరను రూ.103గా నిర్ణయించారు. కాగా తేలికపాటి నుంచి మోస్టరు కోవిడ్-19తో బాధపడుతున్న డయాబెటిస్, హృద్రోగ సమస్యలు ఉన్నవారు కూడా ఈ మాత్రలు వాడవచ్చని గ్లెన్ ఫార్మా స్పష్టం చేసింది. అలాగే.. ‘ఫాబిఫ్లూ’ మాత్రలు కరోనా లక్షణాలను.. దాని తీవ్రతను కేవలం 4 రోజుల్లోనే తగ్గిస్తాయని వివరించడం విశేషం.