చరణ్‌తో బోయపాటి ప్రయోగం.. వర్కౌట్‌ అయ్యేనా?

interesting news on ram charan and boyapati movie

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌ ప్రస్తుతం సుకుమార్‌ దర్శకత్వంలో ‘రంగస్థలం’ చిత్రాన్ని చేస్తున్న విషయం తెల్సిందే. భారీ అంచనాలున్న రంగస్థలం చిత్రం మార్చిలో విడుదల కాబోతుంది. ‘రంగస్థలం’ విడుదల కాకుండానే అప్పుడే చరణ్‌ తన తదుపరి చిత్రాన్ని బోయపాటి దర్శకత్వంలో మొదలు పెట్టిన విషయం తెల్సిందే. బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఇప్పటికే ఒక షెడ్యూల్‌ పూర్తి అయిన రామ్‌ చరణ్‌ మూవీ గురించి సినీ వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతుంది. బోయపాటి తన స్టైల్‌కు పూర్తి విభిన్నంగా రామ్‌చరణ్‌తో ఒక ప్రయోగాత్మక చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లుగా సమాచారం అందుతుంది.

బోయపాటి చిత్రం అనగానే భారీ యాక్షన్‌ సీన్స్‌, హింస మరీ ఎక్కువగా గుర్తుకు వస్తుంది. హీరోయిజంను ఎక్కువగా చూపించడంలో బోయపాటిని మించిన మాస్‌ దర్శకుడు మరొకరు లేరు అనడంలో ఎలాంటి సందేహం లేదు. మాస్‌ చిత్రాలకు బ్రాండ్‌ అంబాసిడర్‌ అయిన బోయపాటి శ్రీను తన స్టైల్‌కు భిన్నంగా కాస్త క్లాస్‌ టచ్‌ ఇచ్చి చిత్రాన్ని చేయబోతున్నాడు. చిరంజీవి సలహా మేరకు ఎక్కువ యాక్షన్‌ సీన్స్‌ లేకుండా, రక్తపాతం అధికంగా లేకుండా చరణ్‌తో మూవీని దర్శకుడు బోయపాటి ప్లాన్‌ చేస్తున్నాడు. యాక్షన్‌ సీన్స్‌ ఎక్కువ లేకుండా, రక్తపాతం లేకుండా సినిమా తీయడం అంటే బోయపాటికి అది ప్రయోగం అన్నట్లే. మరి ఈ ప్రయోగం చరణ్‌కు మంచి చేస్తుందా లేదా తారు మారు అవుతుందా అనేది చూడాలి.