మన టాలీవుడ్ లెజెండరీ హీరో మెగాస్టార్ చిరంజీవి హీరోగా త్రిష హీరోయిన్ గా యంగ్ అండ్ టాలెంటెడ్ దర్శకుడు వశిష్ఠ తెరకెక్కిస్తున్న భారీ విజువల్ ట్రీట్ సినిమా “విశ్వంభర” కోసం అందరికీ తెలిసిందే. అయితే ఈ సినిమా రిలీజ్ కోసం మెగా అభిమానులు మాంచి ఎగ్జైటెడ్ గా ఎదురు చూస్తుండగా రీసెంట్ గానే దర్శకుడు చిరుపై పెట్టిన ఒక వీడియో మంచి వైరల్ గా మారింది.

ఇక లేటెస్ట్ గా అయితే ఈ భారీ మూవీ ఆల్బమ్ పై ఇంట్రెస్టింగ్ అప్డేట్ ను అందించాడు. ఈ మూవీ కి ఆస్కార్ విజేత ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే. మరి లేటెస్ట్ గా తనతో అలాగే చిరు, పాటల రచయిత చంద్రబోస్ తో కలిపి ఒక పిక్ ని షేర్ చేసుకొని విశ్వంభర కోసం కీరవాణి గారు ఏం ప్రిపేర్ చేసారో వినిపించేందుకు తాను చాలా ఎగ్జైటెడ్ గా ఉన్నట్టుగా తెలుపుతున్నాడు.
దీనితో విశ్వంభర ఆల్బమ్ పై మరింత బజ్ ఏర్పడింది అని చెప్పాలి. ఇక ఈ అవైటెడ్ మూవీ రిలీజ్ డేట్ ఎప్పుడు అనే దానికోసం ఫ్యాన్స్ ఎదురు చూస్తుండగా యూవీ క్రియేషన్స్ వారు ఈ మూవీ ని భారీ బడ్జెట్ తో నిర్మాణం వహిస్తున్నారు.