“మిస్టర్ బచ్చన్” నుండి ఇంట్రెస్టింగ్ పోస్టర్ అవుట్ !

“మిస్టర్ బచ్చన్” నుండి ఇంట్రెస్టింగ్ పోస్టర్ అవుట్ !
Cinema News

మాస్ మహారాజ రవితేజ ఈగిల్ సినిమా సక్సెస్ తో దూసుకు పోతున్నారు. ఈ హీరో తదుపరి మిస్టర్ బచ్చన్ సినిమా లో కనిపించనున్నారు. బ్లాక్ బస్టర్ డైరెక్టర్ హరీష్ శంకర్ ఈ క్రేజీ ప్రాజెక్ట్ కు దర్శకత్వం వహిస్తున్నారు. భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీ ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ వారు పనోరమా మూవీస్ తో కలిసి నిర్మిస్తున్నారు. ఈ మూవీ ను అనౌన్స్ చేసినప్పటి నుండి సినిమా పై మంచి పాజిటివ్ బజ్ నెలకొంది. నేడు వాలెంటైన్స్ డే సందర్భంగా మేకర్స్ సరికొత్త పోస్టర్ ని విడుదల చేసారు.

హీరో రవితేజ, హీరోయిన్ భాగ్యశ్రీ లు ఉన్న పోస్టర్ ఇది. రవితేజ కుర్చీ లో కూర్చుని ఉండగా, రవితేజ పై హీరోయిన్ వాలిపోయి ఉంది. ఈ రొమాంటిక్ పోస్టర్ ఆడియెన్స్ ని విశేషం గా ఆకట్టుకుంటుంది. మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తున్న ఈ మూవీ కోసం ఆడియెన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఈ మూవీ కి సంబందించిన మరిన్ని వివరాలు త్వరలోనే వెల్లడి కానున్నాయి.