తేజ సజ్జ భారీ ప్రాజెక్ట్ “మిరాయ్” నుంచి ఇంట్రెస్టింగ్ పోస్టర్ అవుట్ ….!

Interesting poster from Teja Sajja's mega project “Mirai” is out....!
Interesting poster from Teja Sajja's mega project “Mirai” is out....!

ప్రస్తుతం మన టాలీవుడ్ ఆడియెన్స్ లో గట్టిగా వైరల్ అవుతున్న పేరు “ఇంద్ర”. మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన ఈ మూవీ మూమెంట్స్ మరోసారి ఇండస్ట్రీలో వైరల్ గా మారాయి. మరి నిన్న మెగాస్టార్ పుట్టినరోజు కానుకగా ఈ మూవీ ని రీ రిలీజ్ చేయగా మూవీ తో పాటుగా ఆ మూవీ లో చిరంజీవికి చైల్డ్ వెర్షన్ గా కనిపించిన బాల్య నటుడు తేజ సజ్జ పేరు కూడా గట్టిగా వినిపించింది. మరి ఈ నెక్స్ట్ డే ఆగష్టు 23నే తేజ బర్త్ డే కావడం ఒక విశేషం.

ఇక ఈరోజు తన నెక్స్ట్ భారీ మూవీ “మిరాయ్” నుంచి మేకర్స్ క్రేజీ అప్డేట్ ను అయితే అందిస్తున్నట్టుగా టైం ను లాక్ చేశారు. ఆల్రెడీ టీజర్ తో హాలీవుడ్ ధీటు విజువల్స్ ను చూపించిన యంగ్ దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని తెరకెక్కిస్తున్న ఈ మూవీ నుంచి మేకర్స్ ఇంట్రెస్టింగ్ పోస్టర్ ను అయితే తేజ సజ్జ బర్త్ డే కానుకగా రిలీజ్ చేశారు. మరి ఇందులో తేజ సజ్జ పై ఏదో గ్రాండ్ సీక్వెన్స్ ను డిజైన్ చేసినట్టుగా కనిపిస్తుంది.

Interesting poster from Teja Sajja's mega project “Mirai” is out....!
Interesting poster from Teja Sajja’s mega project “Mirai” is out….!

తమ ప్రపంచంలో ఏదో డిజాస్టర్ జరిగిన సమయంలో ఒక రాడ్ ను పట్టుకుని కనిపిస్తున్నారు . దీనితో ఈ పోస్టర్ మాత్రం మరింత ఆసక్తిని పెంచింది అని చెప్పొచ్చు. ఇక ఈ మూవీ కి కూడా హను మాన్ సంగీత దర్శకుడు గౌర హరీష్ సంగీతం అందిస్తుండగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వారు నిర్మాణం వహిస్తున్నారు. అలాగే వచ్చే ఏడాది ఏప్రిల్ 18న రిలీజ్ కి తీసుకురాబోతున్నారు. అలాగే ఈ మూవీ 2డి సహా 3డి లో వరల్డ్ వైడ్ మొత్తం 7 భాషల్లో విడుదలకి తీసుకొస్తున్నారు.