ఆ డైరెక్టర్ చిన్నపిల్లల సినిమాలు ఎక్కువగా చూస్తారట

ఆ డైరెక్టర్ చిన్నపిల్లల సినిమాలు ఎక్కువగా చూస్తారట

టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి అపజయం ఎరుగని దర్శకుడిగా, బాహుబలి సినిమాతో తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచ దేశాలకు చాటిన వ్యక్తిగా నిలిచాడు. ఈయన గురుంచి ఎంత చెప్పినా తక్కువే. అయితే రాజమౌళి గురుంచి ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి కొన్ని ఆసక్తికర విషయాలను బయటపెట్టాడు.

ప్రస్తుతం హోమ్ క్వారంటైన్‌లో ఉంటున్న కీరవాణి ఓ ప్రముఖ మీడియా సంస్థకు ఆన్‌లైన్ ఇంటర్వ్యూ ఇచ్చారు. అయితే ఇందులో కీరవాణికి రాజమౌళిలో నచ్చిన, నచ్చని పాయింట్స్ ఏమిటని అడిగారు. అయితే ఎప్పుడైనా ఖాళీ సమయం దొరికితే రాజమౌళి ఎక్కువగా చిన్నపిల్లల సినిమాలు చూస్తారని, కాస్త మెచ్చుర్డ్ సినిమాలు చూడమని చెప్పినా వినిపించుకోడని అన్నారు. అమెరికన్ కామెడీ డ్రామా ‘ఫారెస్ట్ గంప్’ సినిమా చూడమని చెప్పినా ఇంతవరకు చూడలేదని అన్నారు. ఇది పక్కన పెడితే ఆయనలో ఉన్న గొప్ప అంశం ఏమిటంటే ఏదైనా అనుకుంటే దానిని సాధించేవరకు వదలడని అన్నారు.