పుష్ప సినిమాకు ఆసక్తి చూపుతున్న బాలీవుడ్ జనం

పుష్ప సినిమాకు ఆసక్తి చూపుతున్న బాలీవుడ్ జనం

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రష్మికా మందన్నా హీరోయిన్ గా సుకుమార్ తెరకెక్కిస్తున్న తాజా చిత్రం “పుష్ప”. మొత్తం ఐదు భాషల్లో తెరకెక్కిస్తున్న ఈ చిత్రంతో బన్నీ మొట్ట మొదటి సారిగా తన పాన్ ఇండియన్ సినిమా లక్ ను పరీక్షించుకోనున్నారు.

అయితే బన్నీకు ఉన్న క్రేజ్ కాస్త ప్రత్యేకమనే చెప్పాలి. ఎందుకంటే బన్నీకు ఏమైనా చేసే అభిమానుల కన్నా సైలెంట్ గా ఉండి సపోర్ట్ చేసే అభిమానులే ఎక్కువ అని చెప్పాలి. ముఖ్యంగా యూత్ మరియు అమ్మాయిల్లో అయితే బన్నీ కు మరింత ఆదరణ ఉంది. ఇది కేవలం ఒక్క మన తెలుగులోనే కాదు ఇతర భాషల్లో కూడా ఉంది.

అందుకే ఇప్పుడు వస్తున్న పుష్ప సినిమాకు అత్యంత కీలకమైన బాలీవుడ్ జనమే ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారట. బన్నీ మొదటిసారి బాలీవుడ్ లోకి అడుగు పెడుతున్నా అక్కడ జనం ఈ సినిమా కోసమే ఎక్కువగా ఎదురు చూస్తున్నారట. దీనిని బట్టి సినిమా విడుదల సమయానికి ఖచ్చితంగా బన్నీకు మంచి ఇంపాక్ట్ రావడం ఖాయం అని చెప్పాలి.