క్రిష్ దర్శకత్వంలో సినిమా చేయనున్న పవన్ కళ్యాణ్

క్రిష్ దర్శకత్వంలో సినిమా చేయనున్న పవన్ కళ్యాణ్

తెలుగు చిత్ర పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సుస్థిరం చేసుకొని, ప్రజాసేవ మీద ఉన్న మక్కువతో రాజకీయాల్లోకి వచ్చి, ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటున్నటువంటి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్, గత కొంత కాలంగా రాష్ట్ర రాజకీయాలతో బిజీగా గడుపుతున్న సంగతి మనకు తెలిసిందే. కాగా ఈ తరుణంలో అభిమానుల కోరిక మేరకు సినిమాలు చేయడానికి నిర్ణయించుకున్నారు. కాగా ఈ నేపథ్యంలో వరుస చిత్రాలు చేయడానికి అంగీకారం తెలిపారు. కాగా ప్రస్తుతానికి పవన్ కళ్యాణ్ హీరోగా ‘వకీల్ సాబ్’ చిత్రం రూపొందుతోంది. ఈ చిత్రం తరువాత ఆయన క్రిష్ దర్శకత్వంలో ఒక సినిమా చేయనున్నాడు. ప్రస్తుతం అందుకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి కూడా.

కాగా మొఘలుల కాలం నాటి కథాంశంతో రూపొందనున్న చిత్రంలో పవన్ కళ్యాణ్ రాబిన్ హుడ్ తరహా పాత్రలో కనిపించనున్నారని సమాచారం. కాగా ‘కోహినూర్’ వజ్రం చుట్టూ తిరిగే ఈ కథలో, ఆ వజ్రాన్ని దోచుకునే దొంగగా పవన్ కల్యాణ్ కనిపించనున్నాడు. అయితే ఈ చిత్రంలో పవన్ సరసన కనిపించే భామ కోసం చాలా పుకార్లు వస్తున్నాయి. కాగా ముందుగా ఈ సినిమాలో కథానాయిక పాత్రకి గాను బాలీవుడ్ భామ జాక్విలిన్ పేరు వినబడగా, ఆ తరువాత కీర్తి సురేశ్ పేర్లు వినిపించాయి. కానీ తాజాగా నివేదా పేతురాజ్ ని పవన్ సరసన ఫిక్స్ చేశారని సమాచారం. నివేదా పేతురాజ్ మంచి పొడగరి కావడం వలన, పవన్ కి జోడీగా సెట్ అవుతుందని భావించిన దర్శక నిర్మాతలు నివేదా పేతురాజ్ ని ఖరారు చేసినట్లు సమాచారం. కాగా ఈ విషయంలో అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.