క్లీన్‌గా గుండు చేయించుకున్న కపిల్‌దేవ్

క్లీన్‌గా గుండు చేయించుకున్న కపిల్‌దేవ్

టీమిండియా మాజీ కెప్టెన్ కపిల్‌దేవ్ ఇటీవల క్లీన్‌గా గుండు చేయించుకుని కనిపించాడు. అయితే ఇదివరకు ఎన్నడు కపిల్ అలా కనపడకపోవడం, తొలిసారి గుండులో ఫ్రెంచ్ కట్ షేవ్‌లో కనిపించడంతో ఈ ఫోటోలు కాస్త సోషల్ మీడియాలో బాగా వైరల్ అయిన సంగతి తెలిసిందే.

అయితే తాజాగా ఈ ఫోటోలకు సంబంధించిన వివరాలను ఒక ఛానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కపిల్‌దేవ్ బయటపెట్టాడు. లాక్‌డౌన్ కారణంగా జుట్టు బాగా పెరగడంతో నా కూతురు అమియాను హెయిర్ కట్ చేయమని అడిగానని, తను నా జుట్టును చాలా చిన్నగా కట్ చేసిందని అందుకే సరిగ్గా అనిపించకపోవడంతో నేను పూర్తిగా గుండు గీయించుకున్నానని తెలిపాడు.