అమెరికా అధ్యక్షుడు బైడెన్ మరోసారి దేశాధ్యక్షుడు కావాలని ఉవ్విళ్లూరుతున్నారు. ఇందులో భాగాంగానే ఆయన డెమోక్రాట్ అభ్యర్థిత్వ రేసులో పోటీ పడుతున్నారు. అయితే బైడెన్కు వయసురీత్యా వచ్చే ఆరోగ్య సమస్యలు ఆటంకంగా మారాయి. అవి తన ప్రత్యర్థి రిపబ్లికన్ పార్టీకి చెందిన ట్రంప్‌నకు అవి ప్రచారాస్త్రాలుగా మారుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆయన ఏడాదికోసారి నిర్వహించే సాధారణ వైద్య పరీక్షలు చేయించుకున్నారు.
తాను మరీ యవ్వనంగా కనిపిస్తున్నానని వైద్యులు ఆశ్చర్యపోయారంటూ ఈ సందర్భంగా బైడెన్ చమత్కరించారు. వైద్యులు కూడా ఆయన ఫిట్‌గా ఉన్నట్లు వెల్లడించారు. అధ్యక్షుడు బైడెన్ ఆరోగ్యంగా, చురుగ్గా ఉన్నారని, అధ్యక్ష బాధ్యతలు విజయవంతంగా నిర్వహించడానికి కావాల్సిన దృఢత్వాన్ని కలిగి ఉన్నారని వైద్యులు తెలిపారు. కొత్తగా ఎలాంటి సమస్యలు బయట పడలేదని పేర్కొన్నారు. పరీక్షల అనంతరం వైట్‌హౌస్‌కు చేరుకున్న బైడెన్ మీడియాతో మాట్లాడారు.