International Politics: కెనడాలో భారత కమ్యూనిటీకి బెదిరింపు కాల్స్

International Politics: Threat calls to Indian community in Canada
International Politics: Threat calls to Indian community in Canada

కెనడా- భారత్ మధ్య మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొనే సూచనలు కనిపిస్తున్నాయి. ఆ దేశంలోని భారత జాతీయులకు కొన్ని వారాలుగా బెదిరింపు కాల్స్‌ వస్తున్నాయి. భారీ మొత్తంలో డబ్బులు డిమాండ్‌ చేస్తూ దుండగులు ఈ కాల్స్‌ చేస్తున్నారని అక్కడి భారతీయులు వాపోతున్నారు. ఈ వ్యవహారంపై భారత్‌ స్పందించింది. ఇది ఆందోళనకర అంశమని వ్యాఖ్యానించింది.

కెనడాలోని భారత జాతీయులకు దోపిడీ కాల్స్ రావడం ఆందోళన కలిగించే అంశమని భారత విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్‌ జైశ్వాల్ అన్నారు. భారత్‌-కెనడా చర్చించాల్సిన అంశాలు చాలా ఉన్నాయని తెలిపారు.ఇదివరకు ఒక ఆలయంపై దాడి జరిగిన విషయం తెలిసిందనన్న ఆయన.. దీనిపై కెనడా పోలీసులు విచారణ జరిపి, మతిస్థిమితం లేని వ్యక్తి ఈ దాడికి పాల్పడినట్లు ప్రకటన విడుదల చేశారని గుర్తు చేశారు. కానీ ఈ తరహా ఘటనలు జరుగుతూనే ఉన్నాయని పేర్కొన్నారు. ఈ దోపిడీ కాల్స్‌ కథనాల వేళ అక్కడి అధికారులు విచారణ నిమిత్తం టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేశారు. ఈ తరహా తొమ్మిది ఘటనలపై దర్యాప్తు జరుగుతున్నట్లు సమాచారం.