‘ఇంటిలిజెంట్‌’ ప్రివ్యూ

Inttelligent Movie Preview

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

నటీనటులు :   సాయి ధరమ్ తేజ్, లావణ్య త్రిపాటి 
నిర్మాత:     సి. కళ్యాణ్ 
దర్శకత్వం :   వి వి వినాయక్ 
సినిమాటోగ్రఫీ:   ఎస్. వి. విశ్వేసర్ 
ఎడిటర్ :   గౌతమ్ రాజు 
మ్యూజిక్ :   తమన్ 

సుప్రీం హీరో సాయి ధరమ్‌ తేజ్‌, లావణ్య త్రిపాఠి జంటగా తెరకెక్కిన ‘ఇంటిలిజెంట్‌’ చిత్రం రేపు ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దం అయ్యింది. యాక్షన్‌ చిత్రాల దర్శకుడు వివి వినాయక్‌ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంపై సినీ వర్గాల్లో మరియు ప్రేక్షకుల్లో అంచనాలు భారీగా ఉన్నాయి. ‘ఖైదీ నెం.150’ చిత్రంతో భారీ బ్లాక్‌ బస్టర్‌ సక్సెస్‌ను దక్కించుకున్న వివి వినాయక్‌ కాస్త గ్యాప్‌ తీసుకుని ఈ చిత్రాన్ని చేశాడు. ఈ చిత్రం వినాయక్‌ కెరీర్‌లో మరో బ్లాక్‌ బస్టర్‌ చిత్రంగా నిలుస్తుందనే నమ్మకం చిత్ర యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు. సాయి ధరమ్‌ తేజ్‌ బాడీ లాంగ్వేజ్‌కు తగ్గట్లుగా ఈ చిత్రాన్ని వినాయక్‌ తెరకెక్కించాడు.

ఆకుల శివ కథతో వినాయక్‌ రూపొందిన ఈ చిత్రాన్ని సి కళ్యాణ్‌ నిర్మించాడు. ఇప్పటికే విడుదలైన పాటలు మరియు ట్రైలర్‌లు సినిమాపై అంచనాలు పెంచే విధంగా ఉన్నాయి. ఇక సాయి ధరమ్‌ తేజ్‌ మరియు లావణ్య త్రిపాఠి మద్య రొమాన్స్‌ ఆకట్టుకునే విధంగా ఉంటుందని, తప్పకుండా సినిమాలో వీరి జంటకు ప్రేక్షకులు ఫిదా అవుతారు అంటూ చిత్ర యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు. ఇక ఈ చిత్రంలో మెగాస్టార్‌ చిరంజీవి చమ్మక్‌ చమ్మక్‌ సాంగ్‌ను రీమిక్స్‌ చేయడం జరిగింది. గతంలో చిరంజీవి పాటలను సాయి ధరమ్‌ తేజ్‌ రీమిక్స్‌ చేసి సక్సెస్‌లను దక్కించుకున్నాడు. తాజాగా మరోసారి చిరు పాటను రీమిక్స్‌ చేసిన సాయిధరమ్‌ తేజ్‌ సక్సెస్‌ను దక్కించుకుంటాడేమో చూడాలి.