సిరివెన్న‌ల‌కు నాగ‌భైర‌వ కోటేశ్వ‌రావు అవార్డ్

nagabhairava koteswara rao award for Sirivennela Sitaramasastri

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

సుప్ర‌సిద్ధ సాహితీవేత్త నాగ‌భైర‌వ కోటేశ్వ‌ర‌రావు 9వ స్మార‌క అవార్డు ప్ర‌దానోత్స‌వ స‌భ నెల్లూరులో జ‌ర‌గ‌నుంది. ప‌ట్ట‌ణంలోని టౌన్ హాల్ లో ఈ నెల 11వ తేదీన జ‌రిగే ఈ కార్య‌క్ర‌మంలో ప్ర‌ముఖ పాట‌ల ర‌చ‌యిత సిరివెన్నెల సీతారామ‌శాస్త్రి ఈ అవార్డు అందుకోనున్నారు. ప్ర‌ముఖ సినీ క‌వి వెన్నెల కంటి అధ్య‌క్షులుగా ఉన్న డాక్ట‌ర్ నాగ‌భైర‌వ అవార్డు క‌మిటీ ఆధ్వ‌ర్యంలో జరిగే ఈ కార్య‌క్రమానికి ప్ర‌ముఖ క‌వులు, సాహితీవేత్త‌లు హాజ‌రుకానున్నారు. నెల్లూరు జిల్లాకు చెందిన మంత్రి సోమిరెడ్డి చంద్ర‌మోహ‌న్ రెడ్డి సిరివెన్న‌ల‌కు అవార్డు అంద‌జేయ‌నున్నారు.

వెన్నెల‌కంటి ప్రారంభోప‌న్యాసం చేయ‌నున్నారు. నాగ‌భైర‌వ కోటేశ్వ‌ర‌రావును గురువుగా ఎంతో ఆరాధించే వెన్న‌ల‌కంటి గ‌త ఎనిమిదేళ్ల‌గా అవార్డు ప్ర‌దానోత్స‌వ కార్య‌క్ర‌మం నిర్వ‌హిస్తున్నారు. 2009 నుంచి వ‌రుస‌గా ఎం.ఎస్ రెడ్డి, ద‌ర్భ‌శ‌య‌నం శ్రీనివాస‌చార్య‌, ర‌స‌రాజు, త‌నికెళ్ల భ‌ర‌ణి, సుద్దాల అశోక్ తేజ‌, అద్దేప‌ల్లి రామ్మోహ‌న్ రావు, గొల్ల‌పూడి మారుతీరావు, రావి రంగారావు ఈ అవార్డులు అందుకున్నారు. నాగ‌భైర‌వ కోటేశ్వ‌ర‌రావు స్మార‌క అవార్డుల‌తో పాటు, నాగ‌భైర‌వ స్ఫూర్తి అవార్డులు, అధ్యాప‌క అవార్డు అందించ‌నున్నారు.