ఇప్పుడు స్మార్ట్‌ఫోన్లు కాలిపోయిన ఘటనలు భారీగా పెరిగాయి.. సామ్‌సంగ్ నోట్7 ఫోనుకు భయపడి ఏకంగా విమాన ప్రయాణంలో దాన్ని నిషేధించారు.. రిలయన్స్ లైఫ్ మొబైల్ కూడా కాలిపోయింది.. తాజాగా ఆ కోవలోని ఐఫోన్7 వచ్చి చేరింది. ఆస్ట్రేలియాకు చెందిన మెలినియే తన్ పెలాజ్ అనే యువతి ఫోన్‌ని వాడుతూ ఛార్జింగ్ పెట్టి చేతితో పట్టుకుని అలానే నిద్రపోయిందట.. షడన్‌గా చేయి నెప్పిగా ఉండి మెలకువ వచ్చేసరికి ఫోన్ తగలబడటంతోపాటు తన చర్మం కూడా కాలిపోవడం గమనించిందట.. దీనిపై ఫేస్‌బుక్‌లో సుదీర్ఘ పోస్టుకూడా పెట్టి తనకు ఎంత ఇష్టమైన ఐఫోన్7 వల్ల ఇబ్బందిపడినట్లు గోడు వెళ్లబోసుకుంది.. దాంతో స్పందించిన యాపిల్ సంస్థ తనకు కొత్త ఫోన్ కూడా ఆఫర్ చేసినట్లు సమాచారం.. ఘటన చిన్నదైనా నోట్7 దెబ్బతో జడిసిపోయిన వారు తమ ఐఫోనుకు కూడా భద్రత లేదా అంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే 6ఎస్ ఫోన్లు పేలిన ఘటనలు రెండు మూడు అమెరికాలో నమోదు కావడం తాజా ఘటన.. ఐఫోన్ ప్రతిష్ఠను దిగజారుస్తుందేమోనని సంస్థ కంగారుపడుతుంట.. మీరు ఛార్జింగ్ పెట్టినప్పుడు తీసేసి పడుకోండి మరి…