యాపిల్ ఐఫోన్ లవర్స్‌కు బంపరాఫర్. ప్రస్తుతం వెలుగులోకి వచ్చిన రూమర్స్ ప్రకారం..మార్చి 8న విడుదల కానున్న ఐఫోన్ ఎస్ఈ ఫోన్ ను రూ.15వేలకే సొంతం చేసుకోవచ్చని తెలుస్తుంది.బ్లూమ్ బెర్గ్ ప్రతినిధి మార్క్ గుర్మాన్.. మార్చి8న జరగాల్సిన ఈవెంట్లో యాపిల్ సంస్థ 5జీ ఐఫోన్ ఎస్ఈ 2020ని లాంచ్ చేస్తున్నట్లు తెలిపారు.
ఐఫోన్ ఎస్ఈ 2020 లాంచ్ సమయంలో ఆ ఫోన్ ధర మనదేశంలో భారతదేశంలో ధర రూ. 42,500గా ఉండనుంది. అయినప్పటికీ ఈ ఫోన్ ఫ్లిప్‌కార్ట్‌తో పాటు ఇతర ఈకామర్స్ వెబ్ సైట్లో రూ.26,999 కంటే తక్కువ ధరకు అందుబాటులో ఉండనుంది. అంతేకాదు ఇతర ఆఫర్ల కింద ఆ ఫోన్ ధర దాదాపు రూ.15,000కే సొంతం చేసుకోవచ్చని గుర్మాన్ పేర్కొన్నారు.లీకైన ధర నిజమైతే యాపిల్ దేశీయంగా గణనీయమైన వృద్ధిని సాధించనుంది.
అయితే, వృద్ధి ప్రీమియం విభాగానికి పరిమితం చేయబడింది. ఇప్పటికే యాపిల్ డిసెంబర్ 2021తో ముగిసిన త్రైమాసికంలో 2.3మిలియన్ యూనిట్లను విక్రయించి…సంవత్సరానికి 34శాతం వృద్ధిని నమోదు చేసింది. మార్కెట్ గణాంకాల ప్రకారం..యాపిల్ మనదేశంలో 5 శాతం కంటే తక్కువ మార్కెట్ వాటాను కలిగి ఉండగా.. రూ.20,000 లోపు ధర ఐఫోన్ తో కొత్త కొనుగోలు దారులు అట్రాక్ట్ కానున్నారు.