ప్రముఖ బాలీవుడ్ నటుడు ఇర్ఫాన్ ఖాన్ ఇక లేరు

ప్రముఖ బాలీవుడ్ నటుడు ఇర్ఫాన్ ఖాన్ ఇక లేరు

మన భారతదేశంలో నటన అంటే ప్రాణం పెట్టే నటులు ఎంతో మంది ఉన్నారు. అయితే ఎలాంటి రోల్ ను అయినా సరే చాలా ఈజ్ గా చేయగలిగే అతి తక్కువ ఫైనెస్ట్ నటులలో ప్రముఖ బాలీవుడ్ నటుడు ఇర్ఫాన్ ఖాన్ కూడా ఒకరు. తెలుగు, హిందీ భాషలలోనే కాకుండా మన దేశంలోనే ఏ నటుడు కూడా నటించని భారీ హాలీవుడ్ సినిమాల్లో కూడా ఆయన కనిపించారు.

అంటే ఆయనకున్న నటనా సామర్ధ్యం ఏపాటిదో మనం అర్ధం చేసుకోవచ్చు.బాలీవుడ్ లో ఎన్నో సినిమాలలో కనిపించిన ఇర్ఫాన్ ఖాన్ మన తెలుగులో సూపర్ స్టార్ మహేష్ బాబుతో “సైనికుడు” సినిమాలో విలన్ పప్పు యాదవ్ గా కనిపించి అద్భుతమైన నటనను కనబరిచారు. అలాగే హాలీవుడ్ లో “ది అమేజింగ్ స్పైడర్ మ్యాన్” పార్ట్ 1 మరియు వేలాది కోట్ల కొల్లగొట్టిన “జూరాసిక్ వరల్డ్” సినిమాల్లో కొన్ని కీలక పాత్ర పోషించారు.

అలాగే ఎన్నో ఆస్కార్ అవార్డులను కొల్లగొట్టిన ఇండో హాలీవుడ్ చిత్రం “లైఫ్ ఆఫ్ పై” సినిమాలో హీరోగా నటించిన ఇర్ఫాన్ ఖాన్ ఈరోజు తన తుది శ్వాస విడిచారు. తన పెద్ద ప్రేవు లో ఇన్ఫెక్షన్ సోకడంతో ముంబై కోకిలబెన్ ధీరుభాయ్ అంబానీ హాస్పిటల్ లో చేరిన ఇర్ఫాన్ తన 54 ఏళ్లకే కన్ను మూశారు. దీనితో ఈ వార్త విన్న ఇతర సెలెబ్రెటీలు మరియు అభిమానులు సోషల్ మీడియాలో తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.