సంచలన రికార్డు సృష్టిస్తున్న ఇస్మార్ట్ శంకర్

సంచలన రికార్డు సృష్టిస్తున్న ఇస్మార్ట్ శంకర్

టాలీవుడ్ మాస్ దర్శకుడు పూరి జగన్నాథ్ కు సూపర్ స్టార్ మహేష్ బాబుతో తీసిన “పోకిరి” సినిమాతో ఏ స్థాయి హిట్టయ్యిందో మళ్లీ ఆ స్థాయి హిట్ మాత్రం ఎనర్జిటిక్ రామ్ తో తీసిన “ఇస్మార్ట్ శంకర్” సినిమాతో అందుకున్నారు.

పెట్టిన దానికి డబుల్ ప్రాఫిట్స్ తో అదరగొట్టిన ఈ చిత్రం రామ్ మరియు పూరిలకు ఒక అసలైన కం బ్యాక్ చిత్రం అని చెప్పొచ్చు. నభా నటేష్ మరియు నిధి అగర్వాల్ లు హీరోయిన్లు గా నటించిన ఈ చిత్రానికి సంగీత బ్రహ్మ మణిశర్మ సంగీతం అందించారు.

పక్కా మాస్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రం ఇప్పుడు యూట్యూబ్ లో కూడా సంచలన రికార్డు నెలకొల్పింది. హిందీలో డబ్ అయ్యి విడుదల కాబడిన ఈ చిత్రం ఫాస్టెస్ట్ 50 మిలియన్ వ్యూస్ సహా ఫాస్టెస్ట్ 1 మిలియన్ లైక్స్ కొల్లగొట్టిన మొదటి తెలుగు చిత్రంగా నిలిచింది.

అలాగే ఇప్పుడు మళ్లీ కేవలం మూడు నెలలు తిరక్క ముందే 100 మిలియన్ వ్యూస్ మార్క్ ను క్రాస్ చేసి మరో రికార్డు నెలకొల్పింది. ఈ రోజే 100 మిలియన్ మార్కును అందుకున్న ఈ చిత్రం ఇప్పుడు 1.1 మిలియన్ లైక్స్ సంపాదించుకుంది.