ఫోన్ పేలి కంటి చూపుని కోల్పోయిన యువతి

ఫోన్ పేలి కంటి చూపుని కోల్పోయిన యువతి

సెల్ ఫోన్ వాడకం పట్ల ప్రజలకు ముఖ్యంగా యువతీ యువకులకు ఎంతటి అవగాహన కల్పిస్తున్నప్పటికీ కూడా, తమకేమి పట్టనట్లు కొందరు తమ ఇష్టారీతిలో సెల్ ఫోన్ ని వాడుతూ ప్రమాదాలను కొని తెచ్చుకుంటున్నారు. ఈ సెల్ ఫోన్ వాడుతూ అజాగ్రత్తగా ఉండటం వలన ఇప్పటికే పలువురు ప్రాణాలు కోల్పోయారని వార్తలు వస్తున్నప్పటికీ కూడా ఎవరి ప్రవర్తనలో మార్పు కనిపించడం లేదు. సెల్ ఫోన్ వాడకంలో ప్రజల్లో పూర్తిగా అవగాహనా లేకుండా పోయిందని కనిపిస్తుంది. కాగా తాజాగా సెల్ ఫోన్ ని ఛార్జింగ్ పెట్టి ఒక యువతి వీడియో కాల్ మాట్లాడుతుండగా, అకస్మాత్తుగా ఆ సెల్ ఫోన్ పేలిపోయి, చివరికి ఆ యువతి తన కంటి చూపుని కోల్పోయింది.

కాగా ఈ దారుణమైన ఘటన తమిళనాడులోని తిరువారూరు జిల్లా నీడామంగళం ముట్టయ్యకొత్తనార్‌ తందు ప్రాంతంలో చోటుచేసుకుంది. కాగా ఆ ప్రాంతానికి చెందినటువంటి సుకుమార్‌ అనే వ్యక్తి గత కొంత కాలంగా విదేశాల్లో ఉద్యోగం చేస్తున్నాడు. కాగా ఎప్పటి మాదిరి గానే ఆయన కుమార్తె ఆర్తి, తన తండ్రితో వీడియో కాల్‌లో మాట్లాడుతోంది. కాగా అకస్మాత్తుగా ఆ ఫోన్ పేలిపోవడంతో ఆ శకలాలు అన్ని కూడా ఆ యువతి కళ్ళల్లో, చెవుల్లో చాలా బలంగా గుచ్చుకున్నాయి. కాగా ఆ యువతి కుటుంబీకులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించగా, వైద్యులు ఆమెకి ప్రాథమిక చికిత్స చేసి, మెరుగైన వైద్యం కోసం తంజావూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కాగా ఈ ప్రమాదంలో ఆ యువతి తన చూపును కోల్పోయింది. అయితే సెల్ ఫోన్ ఛార్జింగ్ లో పెట్టి వీడియో కాల్ మాట్లాడటం వల్లే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు వెల్లడించారు.