చెన్నై సూపర్ కింగ్స్ మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనిపై టీమిండియా మాజీ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ ప్రశంసల వర్షం కురిపించాడు. ఐపీఎల్లో అందరికంటే ఎంఎస్ ధోని అత్యత్తుమ ఫినిషర్ అని పఠాన్ అభిప్రాయపడ్డాడు. కాగా ఈ ఏడాది సీజన్లో ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌ను ధోని తనదైన స్టైల్లో ఫినిష్ చేసిన సంగతి తెలిసిందే. “ఐపీఎల్ చరిత్రలో ఎంఎస్ ధోని అత్యత్తుమ ఫినిషర్. ధోని ఐపీఎల్ నుంచి తప్పుకున్న తర్వాత మరొకరు ఈ జాబితాలోకి చేరవచ్చు. కానీ ధోని లాంటి గ్రేట్ ఫినిషర్లు రారు. ఐపీఎల్ చరిత్రలో ధోని, డివిలియర్స్ అద్భుతమైన ఫినిషర్లు.
కానీ ధోనీ ముందంజలో ఉన్నాడు. ఇక సీఎస్కే జట్టు గురించి మాట్లాడూతూ.. చెన్నై సూపర్ కింగ్స్‌ను ఏ జట్టు తక్కువగా అంచనా వేయదు. ఎందుకంటే చాలాసార్లు ఓటమి అంచుల నుంచి విజయ తీరాలకు చేరుకుంది. లీగ్ చరిత్రలో సీఎస్కే అత్యంత ప్రమాదకరమైన జట్టు” అని ఇర్ఫాన్ పఠాన్ పేర్కొన్నాడు. ఇక ప్రస్తుత సీజన్లో 7 మ్యాచ్‌లు ఆడిన సీఎస్కే.. రెండు మ్యాచ్‌లో విజయం సాధించి పాయింట్ల పట్టికలో తొమ్మిదో స్థానంలో ఉంది. కాగా సోమవారం పంజాబ్ కింగ్స్‌తో సీఎస్కే తలపడనుంది.