జగన్‌ ప్రభుత్వంలో ఇరిగేషన్ రంగం అధ్వానం

మంత్రి నిమ్మల రామానాయుడు / Minister Nimmala Ramanaidu
మంత్రి నిమ్మల రామానాయుడు / Minister Nimmala Ramanaidu

వందల, వేల కోట్లు పెట్టి ప్రాజెక్టులు నిర్మిస్తే వైసీపీ ప్రభుత్వం సరైన మెయింటెనెన్స్ కూడా చేయకుండా గాలికి వదిలేసిందని మంత్రి నిమ్మల రామానాయుడు ఆరోపించారు. ఇవాళ ఏపీ సచివాలయంలో ఇరిగేషన్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. అనంతరం మీడియాతో మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడారు. ఇరిగేషన్ పనుల నిర్వహణ, మరమ్మతుల కోసం సీఎం చంద్రబాబు రూ.344 కోట్లు నిధులు మంజూరు చేశారని. గత జగన్ ప్రభుత్వం తప్పిదాలను తమ ప్రభుత్వం సరిచేసుకుంటూ, ఇరిగేషన్ రంగాన్ని గాడిలో పెడుతున్నామని మంత్రి నిమ్మల రామానాయుడు చెప్పారు.