పెద్దారెడ్డి వర్సెస్ vs ప్రభాకర్ రెడ్డి… వణికిపోతున్న తాడిపత్రి

ఈ ఇద్దరి పంతం తాడిపత్రి ప్రజలకు ఆందోళన కలిగిస్తోంది. తాడిపత్రిలో ఆడుగుపెట్టాలని వైసీపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే పెద్దా రెడ్డి ప్రయత్నిస్తుండగా, ఎట్టి పరిస్థితుల్లోనైనా అడ్డుకుని తీరాలని మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్రెడ్డి పంతం పట్టారు. గత ఏడాది సార్వత్రిక ఎన్నికల తర్వాత హింస చెలరేగి ఒక యుద్ధ వాతావరణాన్ని తలపించింది. ఈక్రమంలో పెద్దారెడ్డి తాడిపత్రికి వస్తే రెండు వర్గాలు మరోసారి తలపడతాయేమోననే ఆందోళన పట్టణ ప్రజల్లో నెలకొంది. ఈ వారంలోనే మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి హైకోర్టు అనుమతితో తాడిపత్రికి వస్తున్నారని సమాచారం.