ఉగ్రవాదుల బడాడాన్‌కి మరచిపోలేని గుణపాఠం చెప్పింది మన ఆపరేషన్ సింధూర్. అలాంటి ఉగ్రముష్కరుడికి దుష్ట పాకిస్థాన్ ప్రత్యేక నజరానా ప్రకటించింది. కరుడుగట్టిన అండర్‌గ్రౌండ్ ఉగ్రవాది మసూద్ అజార్‌కు 14 కోట్ల రూపాయలు ఇచ్చేందుకు పాకిస్తాన్ సర్కార్ సన్నద్ధమవుతోంది. ఆపరేషన్ సింధూర్‌లో మరణించిన ఉగ్రవాదుల కుటుంబాలందరికీ ఒక్కొక్కరికి రూ.1 కోటి ఆర్థిక సహాయం అందించనున్నట్లు పాకిస్తాన్ ప్రభుత్వం ప్రకటించింది. కాగా ఆపరేషన్ సింధూర్ తర్వాత మసూద్ అజార్ పరిస్థితేంటన్నది ఎవరికీ తెలీట్లేదు.