విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై జనసేన ఆధ్వర్యంలో ఇవాళ ప్రత్యేక పూజలు చేశారు. దేశానికి ఆపదలను దూరం చేయాలని దుర్గమ్మకు మొక్కుకున్నారు. ఈ పూజల్లో మంత్రి నాదెండ్ల మనోహర్, ఎమ్మెల్సీ హరిప్రసాద్, జనసేన నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి నాదెండ్ల మనోహర్ మీడియాతో మాట్లాడారు. దేశ సైన్యానికి దైవ బలం ఉండాలని ప్రార్ధిస్తూ దుర్గామల్లేశ్వరస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశామని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఇండియన్ ఆర్మీ ప్రతి అడుగు ముందుకు వేస్తూ.. పాకిస్తాన్ ముష్కరులను అణచివేసేలా చూడాలని దుర్గమ్మను కోరామని అన్నారు.