ప్రకాశం జిల్లాలో మంత్రి గొట్టిపాటి రవికుమార్ పర్యటించారు. అక్కడ పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీలు పెంపుపై మంత్రి గొట్టిపాటి రవికుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. కూటమి ప్రభుత్వానికి విద్యుత్ చార్జీలు పెంచే ఆలోచన లేదని.. విద్యుత్ చార్జీలను పెంచకూడదనే విషయంలో మా ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన స్పష్టం చేశారు. యాక్సిస్ గ్రూప్ ఫీల్డ్ ఎనర్జీ విషయంలో ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తూ, ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది ప్రజల ప్రభుత్వమని.. ప్రజలు స్వేచ్ఛగా తిరగాలనే కారంణానే ఎవరినీ ఇబ్బంది పెట్టడం లేదని మంత్రి గొట్టిపాటి అన్నారు.