వర్షాకాలం వచ్చిందంటే చాలు మొక్క జొన్న కంకులు తినేందుకు ఎదురుచూస్తూ ఉంటారు. ఈ మొక్క జొన్న కంకులతో మనకు కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి పెద్దగా ఎవరూ పట్టించుకోరు. కేవలం ఈ మొక్క జొన్న కంకులను ఒక్క రోజు మాత్రమే తింటారు కనుక ఎటువంటి ఆందోళనలు, భయాలు పెట్టుకోకుండా తృప్తిగా వాటిని ఆరగిస్తారు. ఈ రెండు రకాల మొక్క జొన్న కంకులతో అనేక రకాల వెరైటీలను చేసుకోవచ్చు. కంకులతో పిండిలా చేసుకుని గారెలు లేదా వాటిని రుబ్బుకుని పాయసంలా చేసుకుని ఆరగిస్తారు. అంతే కాకుండా వేరే రకాల ఆహార పదార్థాలను కూడా చేసుకుంటారు.
మొక్కజొన్న కంకుల బిజినెస్ కూడా విస్తరిస్తుంది. చాలా చోట్ల రహదారుల పక్కన మొక్క జొన్న కంకులను అమ్ముతూ ఉంటారు. ఈ మొక్క జొన్న కంకులలో కూడా రెండు రకాలు ఉంటాయి. అవి 1) స్వీట్ కార్న్ 2) దేశీబుట్టా. స్వీట్ కార్న్ అనేది ఏడాది పొడవునా, సీజన్లతో సంబంధం లేకుండా మనకు లభిస్తూ ఉంటుంది. కానీ దేశీబుట్టా మాత్రం మనకు కేవలం వర్షాకాలం సీజన్లో మాత్రమే లభిస్తుంది. కావున అనేక మంది వర్షాకాలం సీజన్లో దేశీబుట్టా మొక్కజొన్న కంకులను తినేందుకు ఆసక్తి చూపిస్తారు. ఈ మొక్క జొన్న కంకులకు ధర కూడా అంతలా ఉండకపోవడంతో అనేక మంది ఈ వర్షకాలం సీజన్లో వీటిని ఖరీదు చేసి రకరకాల ఆహార పదార్థాలు, పాయసాలు చేసుకుంటూ ఉంటారు.
మనకు ఏడాది పొడవున లభించే స్వీట్ కార్న్ కానీ కేవలం వర్షాకాలంలో మాత్రమే లభించే దేశీబుట్టాను కానీ తీసుకున్నపుడు దేని ప్రయోజనాలు దానికే ఉంటాయి. దేని ఆకర్షణ విధానాలు దానికే ఉంటాయి. కావున ఈ రెండు వెరైటీలలో ఏది ఉత్తమం అని చాలా మంది ఆలోచిస్తారు. ఒక వ్యక్తి రెండు రకాల వెరైటీలను తీసుకున్నపుడు ఏ వెరైటీ ఉత్తమంగా పని చేస్తుందనే విషయం గురించి ప్రముఖ సెలబ్రెటీ న్యూట్రీషనిస్ట్ ఒకరు ఈ విధంగా చెప్పుకొచ్చారు. ఆయన సోషల్ మీడియా వేదిక ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్టును పంచుకున్నారు. మన దేశీయ మొక్క జొన్న రకం దేశీ బుట్టా విషయానికి వస్తే మాత్రం ఈ మొక్క జొన్న రకంలో దాదాపు 3000పై చిలుకు వెరైటీలు ఉన్నాయి. అంతే కాకుండా ఈ జాతి మొక్క జొన్న పంటను పెంచడం చాలా సులువు.
ఇది కేవలం నీరు, ఎరువులతో సులభంగా పెరుగుతుందని న్యూట్రీషనిస్ట్ వివరించారు. ఈ మొక్క జొన్న జాతిని ఇతర పంటలలో అంతర పంటగా కూడా వేస్తారు. ఇలా అంతర పంటగా వేయడం వలన ఇవి ఎటువంటి తెగుళ్ళు సోకకుండా ఉండేందుకు సహాయపడతాయి. కావున వీటికి పురుగుమందులు ఎక్కువగా పిచికారీ చేయాల్సిన అవసరం ఉండదు. ఈ మొక్కజొన్న పొత్తులు స్వీట్ కార్న్లా కాకుండా పరిపక్వత చెంది ఉంటాయి. ఇందులో ఉండే పోషకాల వలన శరీరంలోని బ్లడ్ షుగర్ అదుపులో ఉంటుంది. స్వీట్ కార్న్‌లో అధికంగా ఉండే షుగర్ స్థాయిలు ఈ జాతి మొక్క జొన్న కంకులలోకి వచ్చేసరికి కాంప్లెక్స్ స్టార్చ్లా మార్చబడతాయి.
స్వీట్ కార్న్‌ను హైబ్రిడ్ విత్తనాల నుంచి పండిస్తారు. ఈ జాతి మొక్కజొన్న కంకులు పెరిగేందుకు చాలా రకాల పోషకాలు అవసరం ఉంటాయి. ఇది చాలా తీపిగా ఉండడం వలన దీనిలో ఉండే పోషకాల సాంద్రత కూడా తక్కువగా ఉంటుంది. ఇది పండేందుకు మనం చాలా రకాల పురుగు మందులను వాడాల్సి వస్తుంది. ఇది పెద్ద మొత్తంలో పండించడం వలన దానిలో ఉండే పోషక విలువలు దెబ్బతింటాయి. ఇలా పురుగు మందులను అధికంగా వాడడం వలన పర్యావరణం దెబ్బ తింటుంది. మరియు వీటిలో ఉండే పోషక విలువలు హరించుకుపోతాయి.
మరియు ఇందులో అధిక మొత్తంలో షుగర్ కంటెంట్, తక్కువ మొత్తంలో ఫైబర్ కంటెంట్ ఉంటుంది. ఈ విషయాన్ని అంతగా ఎవరూ పట్టించుకోరని న్యూట్రీషనిస్ట్ తెలిపారు.స్వీట్ కార్న్ అనేది ఏడాది మొత్తం పాటు లభిస్తుంది. కానీ దేశీ బుట్టా అనేది కేవలం రెయినీ సీజన్లో మాత్రమే లభిస్తుంది కావున ఈ రెయినీ సీజన్లో దేశీ బుట్టా మొక్క జొన్న కంకులను తినేందుకు మొగ్గు చూపమని న్యూట్రీషియనిస్ట్ తెలిపారు.స్వీట్ కార్న్ తో పోల్చుకుంటే, దేశీ బుట్టా జాతి కంకులతో శరీరానికి మాత్రమే కాకుండా పర్యావరణానికి కూడా మేలు కలుగుతుంది. అందువలన ఈ రెయినీ సీజన్ లో స్వీట్ కార్న్ కన్నా దేశీ బుట్టా కంకులను తీసుకోవడమే ఉత్తమం అని న్యూట్రీషియనిస్టులు తెలిపారు.