జీఎస్టీ అంటే విభజించు.. పాలించు

Is GST Divede And Rule Policy

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

వన్ నేషన్ వన్ ట్యాక్స్ అనే నినాదంతో తీసుకొచ్చిన జీఎస్టీతో దేశానికి చిక్కులు తప్పవంటున్నారు ఆర్థిక వేత్తలు. జీఎస్టీ అమలు వెనుక బీజేపీ పక్కా వ్యూహం అమలు చేసిందనే పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఎందుకంటే జీఎస్టీ వచ్చాక నెట్ బ్యాలెన్స్ షీట్ చూస్తే.. ఉత్తరాది రాష్ట్రాలు మిగులులోనూ, దక్షిణాది రాష్ట్రాలు తరుగులోనూ ఉంటాయట. గతంలో ఉత్పత్తి దగ్గర పడే పన్ను.. ఇప్పుడు వినియోగం దగ్గర పడుతుంది కాబట్టి.. వినియోగ రాష్ట్రాలకు ఎక్కువ ప్రయోజనం, ఉత్పత్తి రాష్ట్రాలకు తక్కువ ప్రయోజనం కలుగుతోంది.

ప్రస్తుతం బీజేపీ ఉత్తరాదిలోనే బలంగా ఉంది. ఎంత ట్రై చేసినా దక్షిణాదిలో బలహీనంగానే ఉంది. అందుకే ఉత్తరాదిని బలోపేతం చేసి తమ పీఠం సుస్థిరం చేసుకోవడానికి జీఎస్టీని బీజేపీ తెరపైకి తెచ్చింది. అప్పుడు ఉత్తరాది రాష్ట్రాలు అభివృద్ధిలో దూసుకెళ్తాయి. దక్షిణాదిలో అభివృద్ధి ఆగిపోతుంది. అప్పుడు మోడీ అనుకున్నది నెరవేరడం పెద్ద కష్టం కాదు. అందుకే మోడీ ఆగమేఘాల మీద అన్ని రాష్ట్రాల్ని నయానో, భయానో భయపెట్టి జీఎస్టీ ఆమోదింపజేశారన్నది రాజకీయ పండితుల మాట.

ఆర్థిక వేత్తలు కూడా అదే చెబుతున్నారు. ఎంతో కష్టపడి, దశాబ్దాల పరిశ్రమతో పైకొచ్చిన దక్షిణాది రాష్ట్రాలకు మోడీ జీఎస్టీతో షాకిచ్చారని, కానీ ఇక్కడి సీఎంలు మాత్రం ముందూ వెనుకా చూడకుండా దానికి మద్దతిచ్చేశారని గుర్తుచేస్తున్నారు. భవిష్యత్తులో రాబోయే తరాలకు ఈ మద్దతుపై సమాధానం చెప్పుకోవాల్సి వస్తుందంటున్నారు. దీంతో ఇప్పుడు ఇక్కడి సీఎంల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. అదే జరిగితే అంతా కలిసి ఉద్యమించాలని కూడా అనుకుంటున్నారట.

మరిన్ని వార్తలు