ఈవారం హౌస్ నుంచి బయటకు వెళ్ళేది అతడేనా..? నెటిజన్స్ ఏమంటున్నారంటే

బిగ్ బాస్ సీజన్ 7 ఇప్పటికే మూడు వారాలు పూర్తి చేసుకొని నాలుగో వారంలోకి కూడా అడుగు పెట్టింది. ఇప్పటికే ముగ్గురు హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యి బయటకు కూడా వెళ్లిపోయారు. మొదటి వారంలో కిరణ్ రాథోడ్ హౌస్ నుంచి బయటకు వెళ్ళింది . ఆతర్వాత జరిగిన ఎలిమినేషన్ లో షకీలా హౌస్ నుంచి బయటకు వెళ్లారు . రీసెంట్ గా సింగర్ దామిని హౌస్ నుంచి ఎలిమినేట్ అయిపోయింది . దాంతో ఇప్పుడు హౌస్ నుంచి ఎవరు బయటకు వస్తారా అన్నది మాత్రం ఆసక్తికరంగా మారింది. సోమవారం నాడు జరిగిన నామినేషన్స్ మాత్రం మంచి గరం గరం గా జరిగాయి. బిగ్ బాస్ సందీప్ , శోభా శెట్టి, శివాజీలను జ్యురీ గా ఉంచి మిగిలిన వారు ఒకొక్కరు ఇద్దరినీ నామినేషన్ లో ఉంది సరైన రీజన్ చెప్పాలి అని అన్నారు. ఎవరి రీజన్ కి జ్యురీ మెంబర్స్ కన్విన్స్ అవుతారో వారు నామినేట్ అయినట్టు అని కూడా తెలిపాడు బిగ్ బాస్. దాంతో హౌస్ లో గొడవలు మొదలయ్యాయి.

 

ఇదిలా ఉంటే ఇప్పుడు నాలుగో వారంలో హౌస్ నుంచి ఎవరు బయటకు వెళ్లనున్నారు అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. బిగ్ బాస్ హౌస్ నుంచి ఈ వారం ఒకరు ఎలిమినేట్ అయ్యి బయటకు వెళ్తున్నాడంటూ సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. అయితే ఈ వారం హౌస్ నుంచి బయటకువెళ్ళేనుంది టేస్టీ తేజ అని బాగా టాక్ వినిపిస్తుంది.

ఈ వారం హౌస్ నుంచి బయటకు వెళ్లనుంది తేజ అని సోషల్ మీడియాలో న్యూస్ చక్కర్లు కొడుతున్నాయి. తేజ ఈసారి నామినేషన్స్ లో ఇప్పటివరకు లేడు. నేడు జరిగే నామినేషన్స్ లో తేజ కూడా ఉండే అవకాశం ఉంది. అయితే తేజ ను ఈ వారం బయటకు పంపించేస్తారు అని తెలుస్తోంది. మనోడు మొదటి నుంచి కాస్త డిఫరెంట్ గానే ఉన్నాడు. గేమ్స్ లోనూ పాటిస్పెషన్ తక్కువగానే ఉందని అనిపిస్తుంది. అలాగే హౌస్ లో ఉన్న వారి మధ్య గొడవలు పెడుతున్నాడు. అలాగే హౌస్ లోని వెటకారంగా జోకులు వేస్తూ కొంతమందికి కోపం వచ్చేలా కూడా చేస్తున్నాడు. పైగా కంటెంట్ కూడా ఎక్కువగా ఇవ్వలేకపొతున్నాడు. దాంతో ఈ వారం హౌస్ నుంచి బయటకు వెళ్లనున్నాడని సోషల్ మీడియాలో పోస్ట్ లు బాగా వైరల్ అవుతున్నాయి. మరి ఈ వారం హౌస్ నుంచి తేజ బయటకు వెళ్తాడా లేక మరెవరైనా వెళ్తారో చూడాలి మరి .