RC17 క్రేజీ అనౌన్స్ మెంట్ కి రెడీ అయ్యిందా?

Is RC17 ready for a crazy announcement?
Is RC17 ready for a crazy announcement?

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) వరుస భారీ మూవీ ల తో బిజీగా ఉన్నారు. ఆర్ ఆర్ ఆర్ మూవీ తో గ్లోబల్ స్టార్ గా సూపర్ క్రేజ్ ని సొంతం చేసుకున్నారు. రామ్ చరణ్ తదుపరి శంకర్ దర్శకత్వం లో తెరకెక్కుతున్న గేమ్ చేంజర్ లో కనిపించనున్నారు. ఈ భారీ బడ్జెట్ సినిమా పై ప్రేక్షకుల్లో, అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. నిన్న RC 16 మూవీ గ్రాండ్ గా లాంఛ్ అయిన మన అందరికీ తెలిసిందే. బుచ్చిబాబు దర్శకత్వం లో తెరకెక్కుతున్న ఈ మూవీ పై విపరీతమైన హైప్ నెలకొంది.

అంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న అనౌన్స్ మెంట్ లలో RC17 కూడా ఒకటి. స్టార్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో ఈ మూవీ ఉండనుంది. ఇప్పటికే సుకుమార్ రామ్ చరణ్ పై ఇంట్రో ని చిత్రీకరించినట్లు గతంలో వార్తలు వచ్చాయి. జక్కన్న రాజమౌళి సైతం ఈ ఇంట్రో సీన్ ఇండియా లోనే ది బెస్ట్ అని అంటూ చెప్పుకొచ్చారు. రామ్ చరణ్ బర్త్ డే సందర్భంగా RC 17 కు సంబందించిన అనౌన్స్ మెంట్ వస్తుందా అని అంటూ ఫ్యాన్స్ లో ఇప్పుడు ఆసక్తి నెలకొంది. సుకుమార్ మరియు రామ్ చరణ్ కాంబినేషన్ లో వచ్చిన రంగస్థలం మూవీ సెన్సేషన్ క్రియేట్ చేయడం జరిగింది. ఈ క్రేజీ కాంబో మూవీ కోసం అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.