కాంతారా సీక్వెల్ తో రిషబ్ శెట్టి రెడీ.. వేరే లెవెల్ లో వుంటుందా..?

కాంతారా సీక్వెల్ తో రిషబ్ శెట్టి రెడీ.. వేరే లెవెల్ లో వుంటుందా..?
Cinema News

కాంతారా సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. కాంతారా సినిమా సూపర్ హిట్ అయింది. నాలుగు కోట్లకి పైగా కలెక్షన్లని రిషబ్ శెట్టి కాంతారా సినిమా ద్వారా రాబట్టింది. అయితే ఇప్పుడు రిషబ్ శెట్టి కాంతారా 2 చిత్రం తో రెడీగా ఉన్నారు. డిసెంబర్ నెల లో ఈ సినిమా ని షూట్ చేయాలని అనుకుంటున్నారు. వచ్చే ఏడాది ఆగస్టు నెలలో పూర్తి స్థాయిలో ఈ సినిమాని పూర్తి చేస్తారని తెలుస్తోంది.

కాంతారా సీక్వెల్ తో రిషబ్ శెట్టి రెడీ.. వేరే లెవెల్ లో వుంటుందా..?
Kanatara Movie

మొదటి భాగం కంటే రెండవ భాగం భారీ బడ్జెట్ తో రూపొందుతున్నట్లు తెలుస్తోంది. కాంతారా సీక్వెల్ గా ఈ సినిమా రాబోతోంది. పాన్ ఇండియా వైడ్ గా ఈసారి మూవీ ని రిలీజ్ చేయాలని అనుకుంటున్నారట. బడ్జెట్ కూడా ఎక్కువగా పెట్టబోతున్నారు. ప్రత్యేక శిక్షణ కూడా తీసుకుంటున్నారు హీరో రిషబ్ శెట్టి సినిమా కోసం గుర్రపు స్వారీ తో పాటుగా ప్రాచీన యుద్ధవిద్యలో శిక్షణ పొందుతున్నట్లు తెలుస్తోంది. మరి కాంతారా సీక్వెల్ కూడా కాంతారా మూవీ లాగ సక్సెస్ అవుతుందా లేదా అనేది చూడాలి.