“దేవర” పై ఆ వార్తలు నిజమేనా?

Is that news on “Devara” true?
Is that news on “Devara” true?

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ హీరోగా దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కిస్తున్న అవైటెడ్ భారీ పాన్ ఇండియా మూవీ “దేవర” కోసం అందరికీ తెలిసిందే. మరి ఈ మూవీ షూటింగ్ ఇప్పుడు దాదాపు ఆఖరు దశకి చేరుకోగా సాలిడ్ బజ్ ఈ మూవీ పై ఆల్రెడీ నెలకొంది.

ఇక ఇదిలా ఉండగా ఈ మూవీ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తుండగా ఈ మూవీ తారక్ అయితే డ్యూయల్ షేడ్స్ లో కనిపించనున్నాడు. మరి ఇది వరకే ఈ మూవీ లైన్ సంబంధించి పలు ఇంట్రెస్టింగ్ వార్తలు వినిపించాయి. అలా మూవీ ఒక సముద్ర ప్రాంతానికి చెందిన గిరిజనుల నేపథ్యంలో కనిపిస్తుంది అని బజ్ వచ్చింది.

Is that news on “Devara” true?
Is that news on “Devara” true?

అయితే ఇప్పుడు ఇది నిజమే అని కన్ఫర్మ్ కూడా అయ్యింది. రీసెంట్ గా సంగీత దర్శకుడు అనిరుద్ ఇచ్చిన ఇంటర్వ్యూలో దేవర కథాంశం ఇదే అని వాళ్ళు రివీల్ చేసాడు. దీనిని కొరటాల శివ అద్భుతమైన స్క్రీన్ ప్లే తో తెరకెక్కిస్తున్నారని కూడా తెలిపాడు. దీనితో అయితే దేవర పై ఆ వార్తలు నిజమే అని చెప్పుకోవాలి .