తెలుగు సినీ ఇండస్ట్రీలో చాలా మంది మంచి గుర్తింపు సంపాదించుకున్న వారు ఉన్నారు. అందులో దాదాపు 75 సంవత్సరాల పాటు సినీ కళామతల్లికి ఎన్నో సేవలు అందించిన దివంగత నటుడు అక్కినేని నాగేశ్వరరావు గారు ఒకరు. ఇటీవలే నాగేశ్వరరావు గారి శతజయంతి వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించిన విషయము తెలిసిందే. ముఖ్యంగా అన్నపూర్ణ స్టూడియోలో పంచలోహ విగ్రహాన్ని ఆవిష్కరిస్తూ శతజయంతి వేడుకలను ఘనంగా ప్రారంభించారు. అక్కినేని నాగేశ్వరరావు వారసుడు నాగార్జున తన తండ్రి శతజయంతి వేడుకలను ఎంతో ఘనంగా నిర్వహించాలనే ఉద్దేశంతోనే తన తండ్రికి ఎంతో ఇష్టమైనటువంటి అన్నపూర్ణ స్టూడియోలో తన తండ్రి విగ్రహాన్ని ఆవిష్కరించారు.
అక్కినేని నాగేశ్వరరావు విగ్రహాన్ని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారి చేతుల మీదుగా ఆవిష్కరణ జరిగింది. ఈ కార్యక్రమంలో చాలామంది టాలీవుడ్ సినీ సెలబ్రెటీలు పాల్గొని సందడి చేశారు. కానీ మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ నాగేశ్వరరావు శతజయంతి ఉత్సవాలకు దూరంగానే ఉన్నారు. ఈ కార్యక్రమానికి వీరు దూరం కావడంతో సోషల్ మీడియాలో కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి. బాలకృష్ణకు నాగార్జునకు గత కొంతకాలం నుంచి విభేదాలు ఉన్నాయి. ఈ మధ్యకాలంలో కూడా వీరిద్దరూ ఎక్కడా కలిసిన సందర్భాలు లేవు. అందుకే బాలయ్య ఈ కార్యక్రమానికి దూరంగా ఉన్నారంటూ కొందరు భావిస్తున్నారు. మరోవైపు ప్రస్తుతం బాలకృష్ణ హైదరాబాదులో లేరని.. చంద్రబాబు నాయుడు అరెస్టు కావడంతో రాజమండ్రిలోనే ఉన్నారని అందుకే బాలకృష్ణ ఈ కార్యక్రమానికి హాజరు కాలేకపోయారని వార్తలు వినిపిస్తున్నాయి.
మెగా ఫ్యామిలీ నుంచి రాంచరణ్ ఈ కార్యక్రమాలలో పాల్గొని సందడి చేశారు కానీ చిరంజీవి మాత్రం ఈ కార్యక్రమానికి దూరంగా ఉన్నారు. చిరంజీవి మోకాలు సర్జరీ కారణంగా ఆయన విశ్రాంతి తీసుకుంటున్న విషయము అందరికీ తెలిసిందే. అందుకే ఈ కార్యక్రమానికి హాజరు కాలేదని తెలుస్తోది. కానీ ఏఎన్నార్ గారి శతజయంతి వేడుక సందర్భంగా చిరంజీవి గారు సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ అక్కినేని నాగేశ్వరరావు గారి శతజయంతి ఉత్సవాల సందర్భంగా ఆప్యాయంగా గౌరవపూర్వకంగా ఆ మహానటుడికి నివాళులర్పిస్తున్నానంటూ పోస్ట్ చేశాను ప్రస్తుతం ఈ పోస్టు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మొత్తానికి మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ నాగేశ్వరరావు శతజయంతి వేడుకలకు హాజరు కాకపోవడంపై రకరకాల వార్తలు వినిపించడం గమనార్హం.