““దేవర” లో “అనిమల్” స్టార్ పాత్ర నిజమా?”

"Is the role of "Animal" star in "Devara" real?"
"Is the role of "Animal" star in "Devara" real?"

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ హీరోగా జాన్వీ కపూర్ హీరోయిన్ గా దర్శకుడు కొరటాల శివ తెరకెక్కిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ నే “దేవర”. మరి ఎన్నో అంచనాలు ఉన్న ఈ మూవీ ని మేకర్స్ రెండు భాగాలుగా ప్లాన్ చేస్తుండగా మూవీ ఇప్పుడు శరవేగంగా పూర్తి అవుతుంది. ఇక ఈ మూవీ లోకి తాజాగా మరో స్ట్రాంగ్ ఎడిషన్ యాడ్ అయినట్లు కొన్ని రూమర్స్ ఊపందుకున్నాయి. ఈ మూవీ లో అనిమల్ సెన్సేషన్ నటుడు బాబీ డియోల్ కూడా విలన్ గా నటిస్తాడు అని అంటూ రూమర్స్ మొదలయ్యాయి.

"Is the role of "Animal" star in "Devara" real?"
“Is the role of “Animal” star in “Devara” real?”

ఆల్రెడీ మరో బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్ విలన్ గా నటిస్తుండగా ఇతను కాకుండా బాబీ కూడా కనిపిస్తాడని ఇప్పుడు బాగా వైరల్ అవుతుంది. అయితే ఇది ఇప్పుడు కాదు గతకొన్ని వారాలు కితమే మొదలైన బజ్ ఇప్పుడు బాగా ఊపందుకుంది. దీని ప్రకారం తన రోల్ పూర్తి స్థాయిలో పార్ట్ 2 లో ఉంటుందంట . మరి దీనిపై మరింత క్లారిటీ కూడా రావాల్సి ఉంది. ఇక ఈ భారీ మూవీ కి అనిరుద్ సంగీతం అందిస్తున్నాడు అలాగే ఎన్టీఆర్ ఆర్ట్స్ , యువసుధ ఆర్ట్స్ వారు నిర్మాణం వహించిన ఈ మూవీ ఈ సెప్టెంబర్ 27న గ్రాండ్ గా రిలీజ్ కాబోతోంది.