దీన్ని ప్రజాస్వామ్యం అంటారా..?

రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీచేస్తున్నారంటూ వైసీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి పేర్కొన్నారు. విశాఖ మేయర్ అవిశ్వాస తీర్మానాన్ని ఉద్దేశించి ట్వీట్ చేసిన వైసీపీ అధినేత జగన్.. ప్రజలిచ్చిన తీర్పును అపహాస్యం చేశారన్నారు. బెదిరింపులకు దిగి విశాఖపట్నం మేయర్‌గా ఉన్న బీసీ మహిళను పదవి నుంచి దించేసారు.. టీడీపీ చేస్తున్న దుర్మార్గపు రాజకీయాలకు ప్రత్యక్ష సాక్ష్యం అని అన్నారు జగన్..