అయలాన్ ఓటిటి రిలీజ్ డేట్ ఖరారు!

అయలాన్ ఓటిటి రిలీజ్ డేట్ ఖరారు!
Cinema News

యువ నటుడు శివ కార్తికేయన్ హీరోగా రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా తాజాగా తెరకెక్కిన సైన్స్ ఫిక్షన్ యాక్షన్ ఎంటర్టైనర్ సినిమా అయలాన్. ఇటీవల ఆడియన్స్ ముందుకి వచ్చిన ఈ సినిమా ని మంచి సక్సెస్ సొంతం చేసుకుంది. ఆర్ రవికుమార్ తెరకెక్కించిన ఈ సినిమా ని కోటపడి జె రాజేష్ గ్రాండ్ లెవెల్లో కెజెఆర్ స్టూడియోస్, ఫాంటమ్ ఎఫ్ ఎక్స్ స్టూడియోస్, ఆదిబ్రహ్మ ప్రొడక్షన్స్ సంస్థల పై నిర్మించారు. ఏ ఆర్ రహమాన్ సంగీతం అందించిన ఈ సినిమా లో ఇషా కొప్పీకర్, భానుప్రియ, యోగిబాబు శరద్ కేల్కర్ తదితరులు కీలక పాత్రలు చేశారు.

విషయం ఏమిటంటే, తాజాగా అయలాన్ ఓటిటి అఫీషియల్ రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేసారు. ప్రముఖ ఓటిటి మాధ్యమం సన్ నెక్స్ట్ లో ఈ సినిమా ఫిబ్రవరి 9న ఆడియన్స్ ముందుకి రానుంది. అయితే ఈ సినిమా ని పక్కాగా ఏ ఏ భాషల్లో అందుబాటులోకి వస్తుంది అనే దానిపై క్లారిటీ రావాల్సి ఉన్నది . నిజానికి కొన్ని లీగల్ సమస్యల కారణంగా అయలాన్ తెలుగులో రిలీజ్ కాలేదనేది తెలిసింది. మరి థియేటర్స్ లో ఆకట్టుకున్న ఈ సినిమా ని ఓటిటి ఆడియన్స్ ని ఏ స్థాయిలో మెప్పిస్తుందో చూడాలి.