వైఎస్ జగన్‌పై దాడి యాక్సిడెంటల్‌గా జరిగిందని, తాను కావాలని చేసింది కాదని మాట మార్చాడు జగన్‌పై దాడికేసు నిందితుడు శ్రీనివాస్. ఈ కేసులో ఏడు నెలలుగా జైలులో ఉన్న శ్రీనివాస్ రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి శనివారం బెయిల్ పై విడుదలయిన సందర్భంగా మీడియాతో మాట్లాడిన శ్రీనివాస్ ఆరోజు జరిగిన ఘటన మీద క్లారిటీ ఇచ్చాడు.
చిన్నప్పటినుంచి కష్టాల మధ్య బతికిన తనకు ప్రజా సమస్యలను రాసుకునే అలవాటు ఉందని జగనన్న అంటే ఎంతో అభిమానం అని ఆ అభిమానంతోనే గతేడాది అక్టోబరు 25న ఎయిర్‌పోర్టులో జగన్‌ను చూడగానే ఆయన వద్దకు వెళ్లి సెల్ఫీ తీసుకున్నానని ఆ తర్వాత నేను రాసుకున్న ప్రజా సమస్యలను ఆయనకు వివరించానని ఈ సందర్భంలో నా చేతిలో ఉన్న ఓ కత్తి ఆయన భుజానికి గుచ్చుకుందని అది కావలని చేసింది కాదని అయిన సరే రక్తం కారుతున్నా జగన్ చిరునవ్వుతోనే నాతో మాట్లాడారనీ కానీ ఆయనకు ఏమైనా అవుతుందేమో అనే భయంతో ఆయన భద్రతా సిబ్బంది మాత్రం నన్ను పట్టుకుని చావబాదారు. నన్ను ఏం చేయొద్దని జగన్ వారించడంతో వారు ఆగారనీ లేదంటే నన్ను అక్కడే కొట్టి చంపేసేవారనీ ఒకరకంగా ఈరోజు నేను ప్రాణాలతో ఉన్నానంటే దానికి జగనన్నే కారణమని అయన పేర్కొన్నాడు.
జగన్ అభిమానిగా ఆయనకు సానుభూతి రావాలని ఈ నేరం చేయలేదనీ అది యాక్సిడెంటల్‌గానే జరిగింది. ప్రభుత్వంపై వ్యతిరేకతతో ఉన్న ప్రజలు జగన్‌కు పట్టం కట్టారనీ నేను జగన్ అభిమానిగా ఆయనకు సానుభూతి రావాలని ఈ నేరం చేశానని నిరూపిస్తే నా తల నరుక్కుంటానని అవసరమైతే నాకు నార్కో పరీక్షలు చేసుకోవచ్చని సవాల్ చేస్తున్నానని మీడియాతో శ్రీనివాస్ సవాల్ చేశాడు.