సోనూ సూద్ పై ఐటీ అధికారులు దాడులు

సోనూ సూద్ పై ఐటీ అధికారులు దాడులు

లాక్ డౌన్ వేళ పలు సేవా కార్యక్రమాలు నిర్వహించి రియల్ హీరో అనిపించుకున్న సోనూ సూద్‌పై ఇన్‌కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కన్ను పడింది. ఈ రోజు (బుధవారం) సోనూ సూద్ ఇళ్లపై ఐటీ అధికారులు దాడులు చేశారు. ముంబైలోని సోనూ ఇంట్లోకి వెళ్లి తనిఖీలు చేపట్టారు. అలాగే ఆయన ఆఫీసు సహా సోనూకి చెందిన 6 ప్రాంతాల్లో ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ ఆకస్మిక పరిణామంతో సోనూ షాకయ్యారట. ఆయనకు సంబంధించిన ఆదాయ వివరాల్లో అవకతవకలు జరిగాయనే ఆరోపణలతో ఈ

కరోనా కష్టకాలంలో ఎంతో మందికి పలు రకాలుగా సేవలందించి ఆపద్భాంధవుడయ్యారు సోనూ సూద్. దేశం మొత్తం సోనూ సేవలు చూసి ఫిదా అయింది. పలువురు సినీ, రాజకీయ సెలబ్రిటీలు సైతం సోనూ సేవలను కొనియాడారు. ఈ క్రమంలో ఆయన రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారంటూ వార్తలు వస్తుండటం చర్చనీయాంశం అయింది. అయితే ఇలాంటి వాటిపై స్పందించేందుకు సోనూ నిరాకరించారు.

కాగా, ఢిల్లీ ప్రభుత్వం విద్యార్థుల కోసం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ‘దేశ్ కా మెంటార్’ పథకానికి సోనూని బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించింది. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌తో సోనూ మీటింగ్ జరిగిన తర్వాత కొన్ని రోజుల వ్యవధిలోనే ఐటీ సోదాలు జరగడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఈ పరిస్థితుల్లో సోనూ సూద్‌కు సంబంధించిన ఆరు నివాసాల్లో ఐటీ అధికారులు సోదాలు చేయడం సినీ, రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయింది. ఈ సోదాలపై సోనూ రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి మరి!.