ఐటీ ఆఫీసులో రేవంత్‌రెడ్డి…విచారణ…!

TPCC Chief Revanth Reddy

తెలంగాణ కాంగ్రెస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, కొడంగల్‌ తాజా మాజీ ఎమ్మెల్యే, రేవంత్‌రెడ్డి ఆదాయపన్ను శాఖ అధికారుల ఎదుట విచారణకు హాజరయ్యారు. ఇప్పటికే రేవంత్‌ ఇంట్లో సోదాలు నిర్వహించిన ఆదాయపన్ను శాఖ అధికారులు పలు డాక్యుమెంట్లు, హార్డ్‌డిస్క్‌లు స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. బ్యాంక్‌ల్లోని ఆయన లాకర్లు కూడా తెరిపించి పలు పత్రాలు స్వాధీనం చేసుకున్నారు.

congree-leader-revanth

అయితే ఈరోజు ఆయన విచారణకు హాజరు కావాలని ఆ శాఖ అధికారులు ఆయనకు నోటీసులు ఇచ్చారు. దీంతో ఆయన బషీర్‌బాగ్‌లోని ఐటీ కార్యాలయానికి చేరుకోగా పలు అంశాలపై ప్రశ్నిస్తున్నారు. తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా వెలుగు చూసిన ఓటుకు నోటు కేసుకు సంబంధించిన అంశాలపై అధికారులు కూపీలాగే అవకాశం ఉంది. రేవంత్ ఇంటిలో లభించిన డాక్యుమెంట్లు, ఆధారాల మేరకు ఆయనను ప్రశ్నించే అవకాశం ఉంది. ఐటీ అధికారుల ఎదుట సోమవారం విచారణకు హాజరైన ఉదయ్‌సింహా, సెబాస్టియన్లను కూడా మంగళవారం అధికారులు మరోసారి విచారించే అవకాశం ఉంది.

congress-leader-revanth-it-