కాంగ్రెస్ నేత రేవంత్‌రెడ్డి ఇంట్లో ఆదాయపు పన్ను శాఖ చేపట్టిన సోదాలు ఈరోజు తెల్లవారుజామున 2:30 గంటలకు ముగిశాయి. ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారన్న ఆరోపణల నేపథ్యంలో గురువారం రాత్రి ఏడు గంటలకు రేవంత్ ఇంట్లో అధికారులు సోదాలు ప్రారంభించారు. రెండు రోజులపాటు జరిగిన ఈ సోదాల్లో ప్రింటర్లు, కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ దాడుల్లో రూ.20 కోట్లు లెక్కలు చూపని ఆస్తులు ఉన్నట్టు గుర్తించారు. ఈ సొమ్ము రేవంత్ రెడ్డి బావమరిది జయప్రకాశ్ రెడ్డికి చెందిన శ్రీ సాయిమౌర్య ఎస్టేట్స్ అండ్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి చెందినదిగా గుర్తించారు.
ఈ సమయంలో రేవంత్ రెడ్డి, ఆయన భార్యను కలిపి దాదాపు 31 గంటలపాటు అధికారులు విచారించారు. 150 ప్రశ్నలకు లిఖితపూర్వక సమాధానాలు రాయించుకున్నారు. అక్టోబరు 3న విచారణకు హాజరు కావాల్సిందిగా ఆదేశించారు. యిత్ ఈ దాడులు అన్నీ రాజాకీయ కాక్ష్య సాధింపు నేపధ్యంలో జరుగుతున్నాయని వార్తలు వస్తున్న నేపధ్యంలో రేవంత్ మీద కేసు వేసిన రామారావు బయటకు వచ్చారు. ఇది రేవంత్ అవినీతి మీద పోరాటమని దీనిని రాజకీయ ప్రేపితం అనడం సరికాదని అన్నారు. అయితే ఈరోజు ఉదయం 11 గంటలకు రేవంత్ ప్రెస్ మీట్ పెట్టె అవకాసం కన్పిస్తోంది.