అధికారుల నివాసంలో ఐటీ అధికారులు తనిఖీలు

అధికారుల నివాసంలో ఐటీ అధికారులు తనిఖీలు

కూకట్‌పల్లి టీఆర్ఎస్ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఇంట్లో ఐటీ దాడులు జరిగాయి. కూకట్‌పల్లి వెంకటరావునగర్ కాలనీలోని ఎమ్మెల్యే నివాసంలో ఐటీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఎమ్మెల్యే కృష్ణారావు కుమారుడు సందీప్ రావుకు చెందిన ప్రణీత్ రియల్ ఎస్టేట్ సంస్థ ప్రణీత్ హోమ్స్ వ్యవహారంలో భాగంగా ఈ సోదాలు జరుగుతున్నట్లు తెలిసింది.

అయితే ఆ సంస్థ ఎండీ నరేందర్, మరో ఐదుమంది డైరెక్టర్ల నివాసాలలో కూడా అధికారులు సోదాలు జరిపారు. ఈ సోదాలలో పలు కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. అయితే ఈ సోదాలు నేడు అర్ధరాత్రి వరకు జరిగే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తుంది. మరోవైపు సినీ రంగానికి చెందిన ఇళ్లపై కూడా ఐటీ అధికారులు దాడులు నిర్వహించారు. మొత్తం 14 బృందాలకు చెందిన ఐటీ అధికారులు, వివిధ ప్రాంతాల్లో సోదాలు చేపట్టారు. వార్షిక తనిఖీల్లో భాగంగానే ఈ సోదాలు చేపట్టినట్లుగా తెలుస్తుంది.