IYR Krishna Rao Detailed Explanation
సీఎం చంద్రబాబు గారు నన్ను మొదటి చీఫ్ సెక్రెటరీగా తీసుకుని పని చేసే అవకాశం కల్పించినందుకు, సుప్రీంకోర్టు జడ్జీ స్టేటస్ గా ఉంటుంది చీఫ్ ఇన్ ఫర్మేషన్ కమిషనర్ చూసి తీసుకుడి చెప్పారు.. కాను ఆసక్తి లేదు ఇస్తే బ్రాహ్మణ కార్పొరేషన్ ఇవ్వండని అడిగాను లేకుంటే నేను ఫ్రీగా ఉంటానని చెప్పాను.. దాన్ని ఒప్పుకొని నాకు ఇచ్చారు కాని ఈ రోజు తీసేశారని అన్నారు.. కాని నన్ను కొందరు రిజైన్ చేయమని అడుగుతుంటే ఆశ్చర్యంగా ఉంది.. నాకు డల్లాస్ నుంచి ఫొన్ చేసి కృష్ణారావుగారు మీరు ఫేస్ బుక్ లో పెట్టిన ఆ పోస్టింగ్ సరిగా లేదండి మీరు రిజైన్ చేస్తే బాగుంటుందని అన్నారు..
అయ్యా ఇది ప్రభుత్వానికి నాకు జరిగే విషయం మీకు ఎందుకంటే ఆయన పౌర సమాజం తరఫున మీరు రిక్వస్ట్ చేస్తున్నాను మీరు రిజైన్ చేయాలని అన్నారు.. ఇంగ్లాండ్ నుంచి ఇంకోకరు ఫొన్ చేస్తారు.. సార్ మీరు ఫేస్ బుక్ లో పెట్టిన పోస్టులు కరెక్ట్ కాదని అన్నాడు.. మీకు ఎందుకు నేను గవర్నమెంట్ కు పెట్టాను.. ఇలాంటి వారు అందరు నన్ను అడిగారు కాని ప్రభుత్వం నన్ను అడగలేదు.. కాని ఇక్కడ టీడీపీ అధికార ప్రతినిధి చెప్పిన స్క్రోలింగ్ గా ఈటీవీలో వెస్తున్నారు.. ఈ ఫేస్ బుక్ లో పెట్టిన పోస్ట్ లపై కృష్ణారావు వివరణ ఇవ్వలేదు… ఇది చాలా తప్పు నన్ను అడిగుంటే తప్పకుండా ఎందుకు పెట్టాల్సి వచ్చింది బ్యాక్ గ్రౌండ్ ఏంటని వివరణ ఇచ్చి ఉండేవాన్ని….
ఈ అధికార ప్రతినిధి నుంచి వచ్చిన స్క్రోలింగ్ ను నోట్ చేసుకుంటు వచ్చాను.. సమాధానం ఇద్దామని వచ్చాను.. సీఎం కు జవాబుదారితనం లేకుండా ప్రవర్తించారు.. ఇది చాలా తప్పు ఎందుకంటే ఆరు నెలలనుంచి సీఎంను కలవడానికి విశ్వ ప్రయ్నతం చేస్తున్నాను.. కాని నాకు అపాయింట్ మెంట్ దొరకలేదు అది నిజం.. నాలుగు సార్లు సీఎం పెషీ లోని శ్రీనివాస్ దగ్గర నాలుగు, నాలుగు గంటలు కుర్చున్నాను.. రెండు సార్లు కళ్ల దర్శనం అయింది రెండు సార్లు ఏ దర్శనం కాలేదు.. ఒకసారి సినీయర్ ఆఫీసర్ దగ్గకు వెళ్లి చెప్పాను నా ఇగో బాగా హర్ట్ అయింది.. బ్రాహ్మణ కార్పొరేషన్ కు ఏదో చేయాలని ఈ పదవి తీసుకున్నాను.. చివరి సారిగా ఆయన పీఎస్ కు ఒక మాట చెప్పి వచ్చాను..
మీకు ఐదు నిమిషాలు అపాయింట్ మెంట్ ఇవ్వడం చెతకాకపోతే సీఎం గారితో నాకు ఎయిరో ప్లేయిన్ ఎక్కించు విజయవాడ, హైదరాబాద్ గాని వస్తాను అరగంట సమావేశమవుతాను చాలా సమస్యలు ఉన్నాయి మాట్లాడుకుంటామని చెప్పాను.. మరి కారణం ఏమిటో నాకు తెలియదు సీఎంను కలిసి ఆరు నెలలు అయింది.. నేను జవాబు దారి తనంతో ప్రవర్తించలేదనడం కరెక్ట కాదు.. కేబినెట్ ర్యాంక్ ఇచ్చిన వ్యక్తి ఇలా ప్రవర్తించడం కరెక్ట్ కాదని అంటున్నారు.. నాకు కేబినెట్ ర్యాంక్ లేదు… అది చాలా రాంగ్ గా ప్రచారం చేస్తున్నారు.. నియోజకవర్గాల్లో మిటింగ్ జరుగుతున్నప్పుడు వైసీపీ ఎమ్మెల్యేలకు సమాచారం పోతుంది మా ఎమ్మెల్యేలకు సమాచారం పోవడంలేదు..
నా మిటీంగ్ ఏదైనా ఉంటే నేను జిల్లా కో ఆర్డినేటర్ కు చెబుతాను.. 13 జిల్లాల డిస్టిక్ కోఆర్డినేటర్లు టీడీపీ కార్యకర్తలు.. వారు గనుక టీడీపీ ఎమ్మెల్యేలకు చెప్పకుండా వైసీపీ ఎమ్మెల్యేలకు చెబుతుంటే పార్టీలో చాలా సీరియస్ ప్రాబ్లమ్ ఉంది.. అది రిక్టిఫై చేసుకోవాలి.. దానికి నన్ను నింధించడం భావ్యం కాదు.. నా మీటింగ్ ఏదైనా డిస్టిక్ కో ఆర్డినేటర్ ఆర్గనేజ్ చేస్తాడు.. ఆయనే లోకల్ ఎమ్మెల్యేకు సమాచారం ఇస్తాడు.. వాళ్లకు సమాచారం రాలేదని కృష్ణారావు బాధ్యడేలా అవుతాడు.. లోన్స్ వైసీపీ కార్యకర్తలకే ఇస్తున్నారు.. ఈ విషయం నాకు టోటల్ ఆబ్ జక్షన్.. లబ్ధిదారుడిలో వైసీపీ లబ్ధిదారుడు, తెలుగుదేశం పార్టీ లబ్ధిదారుడు ఉంటాడా లబ్ధిదారుడు మాత్రమే ఉంటాడు.. జన్మభూమి కమిటీలకు ఎక్కడా ప్లేస్ లేకుండా చేశాం..
ఆన్ లైన్ లో అప్లై చేసుకుంటున్నారు.. వైసీపీ వాల్లకు లోన్లు ఇచ్చి మిగతా వారిని లోన్లు ఇవ్వడం లేదనే ఆరోపణ చేయాల్సిన అవసరం ఏముంది.. నేను బీజేపీ ప్రచారానికి విశాఖపట్నానికి వెళ్లాడని అన్నారు.. బ్రాహ్మణులు 18, 19వ శాతాబ్ధాల్లో బ్రాహ్మణుల కోసం చేసిన సత్రాలు 34-40 దాకా ఉన్నాయి..ఈ సత్రాల్లో నెల్లూరులో ఉన్న అయ్యలూరి వారి సత్రం ఒకటి, గుంటూరులో ఉన్న లొడబల్లి వారి సత్రం ఒకటి.. బ్రాహ్మణ కార్పొరేషన్ కు తీసుకుందామని ప్రపోజల్ పెట్టాం.. అది దేవాదాయ శాఖకు పోయింది.. ఇది సీఎం దాకా పోతే కాదని నాకు బాగా తెలుసు.. ఎందుకంటే ఇటువంటి విషయాల్లో ఆయన సరైన నిర్ణయం తీసుకోలేరు.. నేను మినిస్టర్ కు చెప్పాను ఇది మీ లెవల్ లో క్లియర్ చేయగలిగితే అవుతుంది లేకుంటే కాదని చెప్పాను..
నేను క్లియర్ చేస్తానని ఆ రెండు చేసి మాకు ఇచ్చారు.. కాని ఈ రోజు వరకు దానికి ఫుల్ క్రెడిట్ సీఎం గారికే ఇస్తున్నారు.. సీఎంగారు ఈ రెండు సత్రాలను బ్రాహ్మణులకు ఇచ్చారని చెప్పుకుంటున్నారు.. ఈ రోజు ఈ సమస్యను పెద్దది చేశారు కాబట్టి చెప్పాల్సి వస్తుంది.. ఆయన ఆ రెండింటిపై సంతకం పెట్టిన రెండో రోజు నీవు వైజాగ్ లో మాకు ప్రచారం చేస్తావా అని మినిస్టర్ అడిగారు.. మిత్ర పక్షం అడిగారు పోతే తప్పు కాదని నాకు అనిపించింది.. నేను తప్పు చేశానని ఎవ్వరు నాతో అనలేదు.. ప్రత్యక్ష ఎన్నికల్లో పాల్గొనే ఉద్దేశం నాకు లేదు.. కృష్ణారావు నువ్వు మినిస్టర్ అవుతున్నావని అందరు అన్నారు వాట్సాప్ మినిస్టర్ అన్నారు.. నాతో ఎవరు మాట్లాడలేదు ఆఫర్ ఇవ్వలేదు ఇస్తే వద్దంటాను సార్ అని చెప్పాను..
నాకున్న లక్ష్యం ఈ కార్పొరేషన్ సరిగా నడపడం.. ఎమ్మెల్యే పోస్టు ఇవ్వలేదని నేను చేశాననడం కరెక్ట్ కాదు.. నేను ఏమి తప్పు చేశానని ఇంత పెద్ద క్యాంపెయిన్ చేశారో నాకు అర్థం కావడం లేదు.. సీఎంపై విరుచుకుపడుతుంటారు, చాలా కామెంట్స్ చేస్తాంటారు కేశినేని నానిగాని, జేసి దివాకర్ రెడ్డి గాని అవన్ని నోట్ చేసున్నారా మరి ఎక్కడో ఒక చోట పెట్టిన ఫేస్ బుక్ పోస్ట్ ఒకతను ఫేస్ బుక్ లోనే పోస్టు పెట్టాడు.. జేసి దివాకర్ రెడ్డిగారు లేటుగా ఫ్లైట్ మిస్ కావడం ఎయిర్ లైన్స్ లోపం ఉంది, ఎంపీలు వచ్చినప్పుడు కొద్దిగా టైమ్ ఇవ్వాలి కదా అన్ని అన్నారు.. వెంటనే నేను స్ట్రాంగ్ కామెంట్ పెట్టాను నువ్వు ఏమి మాట్లాడుతున్నావు నికు సెన్స్ ఉందా ప్రోటోకాల్ ఆఫీసర్ అక్కడ ఉంటాడు.. సాధారణ ప్రయాణీకులకన్నా అరగంట లేటుగా వీఐపీలు వస్తారు.. ఆ టైమ్ లో ఆయన రాలేదు కాబట్టి వాళ్లు డోర్స్ మూశారు.. చిన్నప్పుడు బస్సుపోతుంటే సర్పంచు వస్తాడని అరగంట ఆపుతాడు.. మనం జాతీయస్థాయి నాయకులమైనా సర్పంచు స్థాయి మనస్తత్వాలు పోలేదని పెట్టాను.. ఆయనకు అది చాలా ఆగ్రహం కలిగించింది.. ఇయన నా పోస్ట్ కు క్లారిఫికేషన్ పెట్టేంతవాడా… ఆయన కొన్ని పోస్టు బయటపెట్టాడు… అవి ఎందుకు పెట్టానో కూడా వాటి గురించి చెబుతాను.. ఏప్రెల్ 22 రవికిరణ్ అనే అతడ్ని అరెస్ట్ చేశారు.. అరెస్ట్ చేసినప్పుడు నేను చాలా ఫీల్ అయ్యాను.. మనం ఎమైనా ఫ్యాసిస్ట్ రాజ్యంలో ఉన్నామా, ప్రజాస్వామ్యంలో ఉన్నామా అని నాకు అనిపించింది.. పొలిటికల్ సెటైర్ వేస్తే నవ్వాలి లేదంటే నువ్వే వేయాలి చెతకాకపోతే ఉరికే కుర్చోవాలి.. ఆ మూడు నాలుగు పోస్టులను షేర్ చేశాను..
ఎందుకు పెట్టావు ఈ పోస్టు లను అని నన్ను అడిగుంటే సమాధానం చెప్పేవాడిని.. నన్ను ఎవరు అడగలేదు.. అసలు ఫేస్ బుక్ ఉందే ఎక్స్ ప్రెస్ యూవర్ సెల్ఫ్.. డోనాల్ ట్రంప్ నుంచి శ్రీకాకుళంలో ఉన్న అరటిపండు వరకు అన్నింటి మీద పోస్ట్ లు పెట్టాను… గౌతమిపుత్ర శాతకర్ణికి ట్యాక్స్ రాయితీ ఇవ్వడం న్యాయబద్ధం కాదని ఒక పోస్ట్ పెట్టాను.. అది వీరికి నచ్చలేదు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నువ్వు పోస్టు పెడతావా.. ఇప్పటికి చెబుతున్నా అది న్యాయబద్ధం కాదు.. చారిత్రక సినిమా నిర్మాణం చేస్తామంటూ చరిత్రను వక్రీకరించినప్పుడు దానికి ట్యాక్ మినహాయింపు ఇస్తావా తప్పు కద.. బాహుబలికి ఎక్ స్ట్రా స్క్రీన్స్ ఇచ్చారు.. అది అందరికి తెలిసి ఉంటే ఎక్కువ మంది నిర్మాతలు ఆ సినిమాను నిర్మించి ప్రచారం చేసుకునేవారు.. గౌతమిపుత్ర శాతకర్ణి నేను చూడలేదు, బహుబలి సినిమా నేను చూశాను అది నా వ్యక్తిగతం.. అనిల్ సింఘాల్ తిరుపతికి పోవడం కరెక్ట్ కాదని నేను చేశానడం కరెక్ట్ కాదు.. ఇది నార్త్ సౌత్ ఇష్యూ కాదని నేను పోస్ట్ పెట్టాను.. ఈ పోస్ట్ లో తెలుగువారినే నియమించే సాంప్రదాయం ఉంది..
ఈ సాంప్రదాయాన్ని ఈ రోజు భగ్నం చేసుకోవాలని అవసరం ఎమైనా ఉన్నాయా లేవు ఎందుకు చేశారు.. ఈ రెండు నేను పెట్టిన పోస్టులు, ఆ మూడు షెర్ చేయడం, సోషల్ మీడియా అడ్మిన్ అరెస్ట్.. ప్రభుత్వానికి పంపిస్తే తిరిగి రావా కాబట్టి నేనంతట నిర్ణయాలు తీసుకుని నేనే చేశాను.. ఈ పోస్ట్ లో పెట్టేవారికి సమర్థత ఉండాలి ప్యాషన్ ఉండాలి అలాంటి వారిని ఎవరినైనా వేసి వాటి యాక్టివిటీ డైయ్యూ చేకుండా ఉంటే సీఎంగారికి నేను శిరసావందనం చేస్తాను.. నన్ను తీసేసినందుకు అది పాడైపోతుందని నేను అనుకోవడం లేదు.. కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది.. రాజకీయ భజన చేయాలంటే వారినే తెచ్చిపెట్టుకోవాల్సింది.. నాకు అయ్యే పని కాదు.. తప్పకుండా పొలిటికల్ మైలేజ్ దీనివల్ల ఆయనకు వచ్చింది.. నాతో ఒకాయన మొత్తం కమ్యూనిటీని టీడీపీకి అంకితం చేశావని అన్నాడు.. ప్రభుత్వ పాలనలో చాలా అంశాలు ఉన్నాయి.. ఆంధ్ర ప్రజలకు నిజాలు వెళ్లడం లేదు.. ఒక నాడు ఉన్న న్యూట్రల్ పేపర్ లా వార్త, ఉదయంలా ఈ రోజు లేదు.. అటువంటి పేపర్ లేకపోబట్టి జరిగే అంశాలు నిజంగా ప్రజలకు చేరడం లేదు.. చేరవేయాల్సిన బాధ్యత మీఅందరికి ఉంది.. వాటిమీద మాట్లాడానికి నేను సిద్ధంగా ఉన్నాను..