ప్లాప్ లతో సతమవుతున్న శర్వానంద్ ఎట్టకేలకు జాను చిత్రం తో పాజిటివ్ టాక్ తెచ్చుకొని హిట్ కొట్టేశానని సంబరంలో ఉన్నాడు. అయితే ఓవర్సీస్ లో మాత్రం జాను చిత్రాన్ని కొనుగోలు చేసిన బయ్యర్లకు కష్టాలు తప్పేలా లేవు. ఈ చిత్రం యూఎస్ ప్రీమియర్ లతో 34,168 డాలర్లను వసూళ్లు చేయగా, మొడటి రోజు 34,391 డాలర్లు రాబట్టి బయ్యర్లని ఏడిపిస్తుంది. అయితే రెండో రోజు మాత్రం పర్వాలేదనిపించేలా 50, 861 డాలర్లని రాబట్టింది. అయితే జాను చిత్రం రెండు రోజులకి కలిపి 1,19,000 డాలర్ల గ్రాస్ రాబట్టగా, బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే ఇంకా 6,30,000 డాలర్లు వసూల్ చేయాల్సి వుంది.
అయితే ఆదివారం వారాంతపు కలెక్షన్లు కాస్త మెరుగుపడిన బయ్యర్లకి మాత్రం నష్టాలు తప్పేలా లేవు. మన తెలుగు రాష్ట్రాలతో పోల్చుకుంటే జాను లాంటి క్లాస్ సినిమాలకి ఆదరణ ఎక్కువే అని చెప్పాలి. అంతేకాకుండా సమంత చిత్రాలకు అక్కడ డిమాండ్ కూడా ఎక్కువే. అలాంటిది సమంత నటించిన ఈ చిత్రం యూఎస్ వద్ద పేలవ వసూళ్లు రాబడుతూ డిజాస్టర్ దిశగా జానూ చిత్రం ప్రయాణిస్తుంది. 96 లాంటి హిట్ చిత్రానికి రీమేక్ అవ్వడం ఒక నెగటివ్ అని చెప్పాలి. సినిమా లో ఉన్నటువంటి ఎమోషన్ మిస్ అవ్వకూడదనే ఉద్దేశ్యం తో దర్శకుడు తమిళ్ లో తెరకెక్కించినట్లే తెలుగులో తెరకెక్కించడం, అది డిజిటల్ మీడియా లో తెలుగు ప్రేక్షకులకి అందుబాటుతో ప్రేక్షకులు థియేటర్లకు వెళ్లే అవకాశం లేకుండా ఉంది. సినిమా కి పాజిటివ్ టాక్ వచ్చిన కలెక్షన్లు రాబట్టలేకపోవడం బయ్యర్ల దురదృష్టమనే చెప్పాలి.