వైఎస్సార్‌సీపీ నేతలు సభలో నినాదాలు.. వెళ్లిపోయిన జగన్..

YS Jagan
YS Jagan

ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు సోమవారం ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగిస్తున్నారు. అదే సమయంలో గవర్నర్ ప్రసంగానికి వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు అడ్డుతగులుతూ.. నినాదాలు చేశారు. ఐదు నిముషాలు నినాదాలు చేసిన అనంతరం వైఎస్ జగన్ సభ నుంచి బయటకు వెళ్లిపోయారు. ఆయన వెంట వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వెళ్లిపోయారు. గవర్నర్ ప్రసంగం కొనసాగుతోంది.