సచివాలయంలో అడుగుపెట్టిన జగన్…సన్మానం….ఆ ఫైలు మీద తోలి సంతకం

jagan is wrong discussing on internet

ఏపీ సీఎం జగన్‌మోహన్ రెడ్డి తొలిసారి సచివాలయంలో అడుగుపెట్టారు. కొద్దిసేపటి క్రితం తాడేపల్లిలోని తన నివాసం నుంచి బయలుదేరిన సీఎం 8:39 గంటలకు సచివాలయంలో అడుగుపెట్టారు. ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన తర్వాత జగన్ సచివాలయంలో అడుగుపెట్టడం ఇదే తొలిసారి. అనుకున్న ముహూర్తానికి సెక్రటేరియట్‌లోని తొలి బ్లాక్‌ మొదటి అంతస్తులో ఉన్న కార్యాలయంలో అడుగుపెట్టిన జగన్ ముఖ్యమంత్రి హోదాలో ఆశా వర్కర్ల జీతాల పెంపు ఫైలుపై తొలిసంతకం చేశారు. ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం తొలిసారిగా సచివాలయంలోని తన ఛాంబర్‌లో అడుగు పెట్టిన సీఎం జగన్‌ ఆశావర్కర్ల వేతనాలు రూ.10వేలకు పెంచుతూ మొదటి సంతకం చేశారు. అనంత ఎక్స్‌ప్రెస్‌ హైవేకు కేంద్రం అనుమతి కోరుతూ రెండో సంతకం చేశారు. జర్నలిస్ట్‌ హెల్త్‌ ఇన్సూరెన్స్‌ రెన్యూవల్‌పై సీఎం జగన్‌ మూడో సంతకం చేశారు. జగన్ తొలిసారిగా సచివాలయానికి వచ్చిన జగన్ ని ఏపీ సచివాలయంలో ముఖ్యమంత్రి జగన్‌కు ఉద్యోగులు ఘనంగా సన్మానించారు. సీఎం ఛాంబర్‌లో జగన్‌కు పలువురు నేతలు కూడా అభినందనలు తెలిపారు. ఉదయం 10 గంటలకు అన్ని శాఖల కార్యదర్శులు, హెచ్‌వోడీలతో సీఎం జగన్‌ సమావేశం కానున్నారు. ఉదయం 10.50 గంటలకు ఉద్యోగులనుద్దేశించి జగన్‌ మాట్లాడనున్నారు.