మంత్రివర్గం ప్రమాణ స్వీకారానికి వరుణుడి దీవెన…పనులకి అంతరాయం

rain blessings for ministers oath ceremony

కాసేపట్లో ఏపీ రాష్ట్ర మంత్రివర్గం ప్రమాణ స్వీకారం జరగనుంది. సచివాలయ ప్రాంగణంలో నూతన మంత్రులు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఉదయం 11.49 గంటలకు గవర్నర్‌ నరసింహన్‌ ప్రమాణం చేయించనున్న సంగతి తెలిసిందే. మంత్రులుగా ధర్మాన కృష్ణదాస్‌, బొత్స, పుష్ప శ్రీవాణి, అవంతి శ్రీనివాస్‌, కురసాల కన్నబాబు, పిల్లి సుభాష్‌ చంద్రబోస, పినిపే విశ్వరూప్‌, సీహెచ్‌.శ్రీరంగనాథరాజు, తానేటి వనిత, ఆళ్ల నాని, పేర్ని నాని, కొడాలి నాని, వెల్లంపల్లి శ్రీనివాస్‌, మోపిదేవి వెంకటరమణ, మేకతోటి సుచరిత, బాలినేని శ్రీనివాస్‌రెడ్డి, ఆదిమూలపు సురేశ్‌, మేకపాటి గౌతంరెడ్డి, అనిల్‌కుమార్‌ యాదవ్‌, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కె.నారాయణస్వామి, అంజాద్‌ బాషా, బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, జయరాం, శంకరనారాయణలు ప్రమాణం చేయనున్నారు. అయితే ఏపీ సచివాలయ ప్రాంతంలో ఉరుములతో కూడిన వర్షం కురుస్తోంది. సచివాలయంలో ఇవాళ మంత్రుల ప్రమాణ స్వీకార కార్యక్రమం జరగనున్న నేపధ్యంలో సచివాలయ పరిసర ప్రాంతాల్లో కుండపోత వర్షం కురుస్తుండడంతో మంత్రుల ప్రమాణ స్వీకార కార్యక్రమ ఏర్పాట్లకు అంతరాయం కలుగుతోంది. ప్రమాణ స్వీకార ప్రాంగణంలో వర్షంతో అధికారులు ఆందోళన చెందుతున్నారు. విధులు నిర్వహిస్తున్న పోలీసులు, సిబ్బందికి వర్షంతో ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. దీని మీద మరింత క్లారిటీ రావాల్సి ఉంది.